Chiranjeevi Pawan Kalyan
Chiranjeevi Pawan Kalyan : నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు, సెలబ్రిటీలు అంతా ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ క్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యకు స్పెషల్ గా శుభాకాంక్షలు తెలుపుతూ నిన్నే పోస్ట్ చేసారు. దీంతో తమ్ముడి శుభాకాంక్షలు సంతోషించి చిరంజీవి స్పెషల్ పోస్ట్ పెట్టారు.(Chiranjeevi Pawan Kalyan)
పవన్ చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి బర్త్ డే జరిగిన ఫోటోలను షేర్ చేసి.. జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు. తమ్ముడు కల్యాణ్.. ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షత, పట్టుదల చూసి ప్రతీ క్షణం గర్వపడుతూనే ఉన్నా. నిన్ను నమ్మినవాళ్లకు ఏదో చేయాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది. ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జనసైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటున్నాను అని తెలిపారు.
జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు!
తమ్ముడు కల్యాణ్…
ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా… pic.twitter.com/UMN5vu3nqZ
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 22, 2025
Also Read : Chiarnjeevi : చిరంజీవికి ఇంకా ఆ లోటు అలాగే ఉందా? అలాంటి సినిమాలు తీస్తారా?
నిన్న పవన్ కళ్యాణ్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ.. విశ్వంభరునికి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం. వెల కట్టలేని జీవిత పాఠం. ఒక సాదాసీదా సాధారణ కుంటుంబం నుంచి వచ్చిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తిప్రతిష్ఠలు సాధించడం నాకే కాదు నాలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు.. కువిమర్శలకు కుంగిపోనూ లేదు. విజయాన్ని వినమ్రతతోనూ.. అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. అన్నిటిని భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన ‘విశ్వంభరుడు’. పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షుతో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను అని పోస్ట్ చేసారు.
విశ్వంభరునికి జన్మదిన శుభాకాంక్షలు
చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య @KChiruTweets గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం… వెల… pic.twitter.com/buwB9r3QS7
— JanaSena Party (@JanaSenaParty) August 21, 2025