Chiranjeevi Pawan kalyan wishes to Ram Charan on his birthday
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పుట్టిన రోజు నేడు (మార్చి 27). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెగా స్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
‘నా ప్రియమైన రామ్ చరణ్‌కు హ్యాపీ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ‘పెద్ది’ ఫస్ట్ లుక్ చాలా బాగుంది. నటుడిగా మరో కొత్త కోణం తెరపైకి రానుంది. సినిమా ప్రేమికులు, అభిమానులకు ఇది కనులపండుగ కానుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
L2E Empuraan : ‘L2E : ఎంపురాన్’ మూవీ రివ్యూ.. లూసిఫర్ సీక్వెల్ ఎలా ఉందంటే..?
Happy Birthday
My dear @AlwaysRamCharan !💐💐 Many Many Happy Returns!! 🤗 #Peddi looks very intense and I am sure it will bring out a new dimension of the Actor in you and will be a feast for Cinema lovers and Fans!! Bring it on!!! 😍— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2025
‘వెండి తెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనందోత్సాహాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తొలి చిత్రం నుంచీ ప్రతి అడుగులో ప్రేక్షకులను మెప్పిస్తూనే.. ఎప్పటికప్పుడు నవ్యరీతిలో పాత్రలను ఎంచుకొంటున్నారు. మరో వైపు రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియచేస్తున్నాయి. నటనలో విభిన్న శైలి చూపడం, పెద్దలపట్ల గౌరవ భావన, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల బాధ్యత… రామ్ చరణ్ ఎదుగుదలకు కచ్చితంగా దోహదం చేస్తాయి. సమున్నత స్థాయిలో నిలవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.’ అని పవన్ అన్నారు.
RC 16 Title : ఆర్‌సీ16 టైటిల్ ఇదే.. రామ్‌చరణ్ ఫస్ట్‌లుక్ అదిరిందిగా..
రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి
వెండి తెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న @AlwaysRamCharan కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనందోత్సాహాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తొలి చిత్రం నుంచీ ప్రతి అడుగులో ప్రేక్షకులను… pic.twitter.com/it3WyoZKRT
— JanaSena Party (@JanaSenaParty) March 27, 2025