RC 16 Title : ఆర్‌సీ16 టైటిల్ ఇదే.. రామ్‌చ‌ర‌ణ్ ఫ‌స్ట్‌లుక్ అదిరిందిగా..

బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఓ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

RC 16 Title : ఆర్‌సీ16 టైటిల్ ఇదే.. రామ్‌చ‌ర‌ణ్ ఫ‌స్ట్‌లుక్ అదిరిందిగా..

Ram Charan RC 16 Title is peddi

Updated On : March 27, 2025 / 9:37 AM IST

బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఓ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆర్‌సీ16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. జాన్వీక‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివన్న, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ‌ర‌వేగంగా ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతోంది.

Ram Charan Birthday : మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ వరకు.. ‘చిరుత’ ప్రయాణం.. రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్..

ఇక గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు నేడు (మార్చి 27). ఈ సంద‌ర్భంగా ఆర్‌సీ16 టైటిల్‌ను వెల్ల‌డించారు. ఈ చిత్రానికి “పెద్ది” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అదే స‌మ‌యంలో రామ్‌చ‌ర‌ణ్ ఫ‌స్ట్‌లుక్‌తో పాటు టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ పోస్ట‌ర్స్‌ విడుద‌ల చేశారు. ‘ఏ మ్యాన్ ఆఫ్ ది ల్యాండ్‌, ఏ ఫోర్స్ ఆఫ్ ది నేచుర్’ అంటూ ఈ ఫోటోల‌కు క్యాప్ష‌న్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్స్‌ వైర‌ల్ అవుతున్నాయి.

NTR : సన్నగా మారిన ఎన్టీఆర్.. లుక్స్ వైరల్.. ప్రశాంత్ నీల్ సినిమా కోసమా?

క్రికెట్, రెజ్లింగ్ క్రీడల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని స‌మాచారం. ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.