NTR : సన్నగా మారిన ఎన్టీఆర్.. లుక్స్ వైరల్.. ప్రశాంత్ నీల్ సినిమా కోసమా?

ఎన్టీఆర్ ఇంతలా మేకోవర్ అవుతుంటే ప్రశాంత్ నీల్ సినిమా హీరో మరీ ఇంత స్లిమ్ గా ఉంటాడా అంటూ కొత్త డౌట్స్ వస్తున్నాయి జనాల్లో.

NTR : సన్నగా మారిన ఎన్టీఆర్.. లుక్స్ వైరల్.. ప్రశాంత్ నీల్ సినిమా కోసమా?

Jr NTR New Lean Looks goes Viral Fans Thinks its for Prasanth Neel Movie

Updated On : March 26, 2025 / 9:24 PM IST

NTR : ఎన్టీఆర్ న్యూ లుక్ చూసిన అభిమానులు ఖుషీ అవుతుంటే ఆడియెన్స్ మాత్రం షాక్ అవుతున్నారు. తారక్ మేకోవర్ చూసి స్టన్ అయ్యిపోతున్నారు జనాలు. ప్రజెంట్ ఎన్టీఆర్ లుక్ కంత్రికి ఎక్కువ యమదొంగకు తక్కువలా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ఇంతలా మేకోవర్ అవుతుంటే ప్రశాంత్ నీల్ సినిమా హీరో మరీ ఇంత స్లిమ్ గా ఉంటాడా అంటూ కొత్త డౌట్స్ వస్తున్నాయి జనాల్లో.

Also Read : Sampoornesh Babu : ‘సోదరా’.. అంటూ వచ్చేస్తున్న సంపూర్ణేష్ బాబు.. రిలీజ్ ఎప్పుడంటే..

మ్యాన్ ఆఫ్ మాసెస్ గా బాక్సాఫీస్ దగ్గర దమ్ము చూపిస్తున్న ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ లుక్ ఆడియెన్స్ కు ఎప్పటికీ గుర్తే. ఒక స్థాయిలో అదే లుక్ లో ఉంటే సినిమాలు హిట్ అవ్వడం కష్టమని భావించిన ఎన్టీఆర్ డైరెక్టర్ రాజమౌళి అడ్వైజ్ తో యమదొంగలో క్రేజీ మేకోవర్ తో ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఆ స్టన్నింగ్ లుక్ తో షాక్ అయ్యింది టాలీవుడ్.

ntr looks

మళ్లీ అలాంటి ఫీల్ ఇస్తున్నారు ఎన్టీఆర్. లేటెస్ట్ గా ఎన్టీఆర్ లుక్ చూస్తే మళ్లీ అదే రేంజ్ లో మేకోవర్ కనిపిస్తోంది. జపాన్ లో దేవర ప్రమోషన్స్ లో ఉన్న తారక్ లుక్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. ఎన్టీఆర్ దేవర మూవీ జపాన్ దేశంలో ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మూవీని జపాన్ లో భారీ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు డైరెక్టర్ కొరటాలతో కలిసి వెళ్లారు జూనియర్ ఎన్టీఆర్. అక్కడి మీడియా, ఆడియెన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఫుల్ బిజీబిజీగా గడిపేస్తున్నారు.

Also See : Preity Mukhundhan : మోడ్రన్ లుక్స్ లో మంచు విష్ణు కన్నప్ప హీరోయిన్.. ప్రీతీ ముకుందన్ ఫొటోలు..

ప్రమోషన్స్ లో పాల్గొన్న ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఎన్టీఆర్ సన్నగా అయిన లుక్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా కోసమే ఎన్టీఆర్ న్యూ లుక్ అంటూ సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది.

ntr looks

ప్రశాంత్ నీల్ సినిమా అంటే జనరల్ గా హీరో స్ట్రాంగ్ బాడీ తో టఫ్ గా కనిపిస్తుంటాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం మరీ స్లిమ్ అయిపోయి కనిపిస్తుండడంతో అసలు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఎలా చూపించబోతున్నారో అంటూ టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ ,ఎన్టీఆర్ కాంబినేషన్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతోంది సినిమా. ఇప్పటికే ఎన్టీఆర్ లేకుండా షూటింగ్ మొదలుపెట్టేసిన ప్రశాంత్ నీల్ జెట్ స్పీడ్ లో మూవీని తెరకెక్కిస్తున్నారు. నెక్ట్స్ మంత్ లోనే ఎన్టీఆర్ ఈ సినిమా షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి ఎన్టీఆర్ సన్నగా మారి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.