Chiranjeevi : ఆ తమిళ స్టార్ డైరెక్టర్‌తో చిరు సినిమా.. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్..!

తమిళ్ స్టార్ డైరెక్టర్ తో ఒక సినిమా చేసేందుకు చిరు సిద్దమవుతున్నాడట. ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు కూడా మొదలయ్యాయని..

Chiranjeevi plans 157 movie with tamil star director

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దసరా సందర్భంగా తన కొత్త సినిమాని పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టేశాడు. Mega156 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, చిరంజీవికి సంబంధించిన మరో మూవీ గురించి న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఒక తమిళ్ స్టార్ డైరెక్టర్ తో ఒక సినిమా చేసేందుకు చిరు సిద్దమవుతున్నాడట. ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు కూడా మొదలయ్యాయని, వశిష్ట సినిమా జరుగుతున్న సమయంలోనే ఈ చిత్రాన్ని కూడా పట్టాలు ఎక్కించబోతున్నాడని వినిపిస్తుంది.

ఇక ఈ సినిమాని తమిళ నిర్మాణ సంస్థతో కలిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఆధ్వర్యంలోని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నదని చెబుతున్నారు. కాగా వశిష్టతో మూవీ కంటే చిరంజీవి కూతురు నిర్మాణంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు అని కూడా మాటలు వినిపించాయి. కానీ ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. ఇప్పుడు తమిళ దర్శకుడు సినిమా వార్త వినిపిస్తుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే.. గత ఏడాది కార్తీతో ‘సర్దార్’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న ‘పీఎస్ మిత్రన్’ అని సమాచారం.

Also read : Bhagavanth Kesari : పవన్ కళ్యాణ్‌కి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ ప్రత్యేక షో.. ఎందుకో తెలుసా..?

అయితే ఈ సినిమా చర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయట. భోళాశంకర్ సెట్స్ పైన ఉన్న సమయంలోనే మిత్రన్.. చిరుకి ఫస్ట్ హాఫ్ వినిపించాడట. సెకండ్ హాఫ్ పై ఇంకా వర్క్ చేస్తుండడంతో మూవీ అనౌన్స్‌మెంట్ లేట్ అయ్యింది. అయితే చిరంజీవి తాజాగా Mega156 కి పని చేస్తున్న రైటర్స్ ని మిత్రన్ దగ్గరకి పంపించాడట. స్క్రిప్ట్ వర్క్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి.. సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని చిరంజీవి భావిస్తున్నాడట. Mega156 తో పాటు ఈ సినిమాని కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.