Chiranjeevi Ram Charan Allu Arjun Mega family Sankranti festival photo
Mega Sankranti : మెగా ఫ్యామిలీ.. పండుగని అయినా, పార్టీని అయినా కుటుంబమంతా కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంటారు. ఈక్రమంలోనే ఈ సంక్రాంతిని కూడా అందరూ కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఈ పండక్కి మెగా ఇంటికి కొత్త మనవరాలు, కొత్త కోడలు రావడంతో.. ఈసారి సెలబ్రేషన్స్ ఇంకొంచెం ఆనందంగా ఉండబోతున్నాయి.
ఇక ఈ మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ కి బెంగళూరు ఫార్మ్ హౌస్ విడిది అయిన సంగతి తెలిసిందే. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీస్ అంతా బెంగళూరుకి చేరుకొని అక్కడ పండగని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఆ మెగా ఫెస్టివల్ సెలబ్రేషన్ కి సంబంధించిన అప్డేట్స్ ని ఉపాసన ఒక్కోటిగా అభిమానులకు తెలియజేస్తూ వస్తున్నారు. అయితే ఫ్యాన్స్ అంతా ఫుల్ ఫ్యామిలీ ఫోటో కోసం ఎదురు చూశారు.
Also Read : Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్.. సంక్రాంతి స్పెషల్ పార్టీ.. త్రివిక్రమ్ ఎక్కడ?
తాజాగా ఈ నిరీక్షణకి తెర దించుతూ మామా కోడళ్ళు చిరంజీవి, ఉపాసన, లావణ్య త్రిపాఠి.. ఫుల్ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేశారు. ఈ పిక్ లో గమనిస్తే.. అందరూ ఒక కలర్ కోడ్ ని ఫాలో అవుతూ డ్రెస్సింగ్ మెయిన్‌టైన్ చేశారు. మగవారంతా వైట్ షేడ్ డ్రెస్సులో ఉంటే, ఆడవారంతా రెడ్ డ్రెస్సులో కనిపిస్తున్నారు. ఈ డ్రెస్ కోడ్ కేవలం మనుషులకు మాత్రమే కాదు.. జంతువులకు కూడా మెయిన్‌టైన్ చేశారు. రామ్ చరణ్ ఫేవరెట్ పెట్ ‘రైమ్’కి కూడా రెడ్ డ్రెస్ వేయడం విశేషం.
ఇక ఈ పిక్ లో కూడా ఉపాసన తమ కూతురి ‘క్లీంకార’ పేస్ ని రివీల్ చేయలేదు. ఫేస్ కనపడకుండా ఎప్పటి లాగానే మొహం మీద లవ్ సింబల్ ని పెట్టారు. ఈ మెగా ఫ్యామిలీ ఫొటోలో అందరూ ఉన్నారు. పవన్ పిల్లలు అకిరా, ఆద్యలు కూడా ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడే లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆ ఫోటోలు, వీడియోలు వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.