Waltair Veerayya : వాల్తేరు వీరయ్య 200 డేస్ సెలబ్రేషన్స్.. మరోసారి మెగా మాస్ రీయూనియన్..

వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్స్ లో భారీ విజయం సాధించి, అనంతరం ఓటీటీలో కూడా సందడి చేసింది. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి.

Chiranjeevi Raviteja Waltair Veerayya Movie 200 days celebrations by Movie unit

Waltair Veerayya 200 Days Celebrations : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వింటేజ్ లుక్స్ అండ్ యాక్షన్ కామెడీతో మరోసారి తన స్టామినాని చూపించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. డైరెక్టర్ బాబీ(Bobby) దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ(Raviteja) కలిసి నటించగా ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించింది. ఇప్పటి హీరోలు 100 కోట్ల సినిమాలు అంటుంటే వాల్తేరు వీరయ్యతో 200 కోట్లు సాధించి ఎప్పటికి నేనే మెగాస్టార్ అంటూ తన సత్తాని మరోసారి చాటాడు మెగాస్టార్.

ఇక వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్స్ లో భారీ విజయం సాధించి, అనంతరం ఓటీటీలో కూడా సందడి చేసింది. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి. అయితే ఇది ఒక ప్రైవేట్ పార్టీలా మాత్రమే జరిగింది. వాల్తేరు వీరయ్య చిత్రయూనిట్, పలువురు సినీ ప్రముఖుల మధ్య మాత్రమే ఓ ప్రైవేట్ హోటల్ లో వాల్తేరు వీరయ్య 200 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి.

Chiranjeevi : ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తారెందుకు?

ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా వచ్చి మరోసారి మెగా మాస్ అభిమానులకి కిక్కిచ్చారు. రవితేజ, చిరు కలిసి మరోసారి సందడి చేశారు. ఇక ఈ పార్టీలో వచ్చిన ప్రముఖులంతా మాట్లాడారు. ఫైట్ మాస్టర్స్ ఈ సినిమాలోని సాంగ్స్ కి డ్యాన్సులు వేసి అలరించారు. అయితే ఈ ఈవెంట్ ప్రైవేట్ గా చిత్రయూనిట్ వరకే జరగడంతో ఈవెంట్ వీడియో ఫుటేజ్ ఇంకా బయటకు రాలేదు. కొన్ని ఫోటోలు మాత్రం బయటకు వచ్చాయి.