Nijam With Smitha : నటుడిగా ఉత్తమ అవార్డుని.. చిరంజీవి 10వ తరగతిలోనే అందుకున్నాడు.. ఆ కథ తెలుసా?

టాలీవుడ్ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా చేస్తున్న కొత్త టాక్ షో 'నిజం విత్ స్మిత'. ఈ టాక్ షో కి మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యాడు. కాగా ఈ ఎపిసోడ్ లో చిరంజీవి.. తనకి నటన పై ఆసక్తి ఎలా కలిగిందో తెలియజేశాడు.

Nijam With Smitha : నటుడిగా ఉత్తమ అవార్డుని.. చిరంజీవి 10వ తరగతిలోనే అందుకున్నాడు.. ఆ కథ తెలుసా?

Nijam With Smitha chiru acting interest

Updated On : February 10, 2023 / 12:36 PM IST

Nijam With Smitha : టాలీవుడ్ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా చేస్తున్న కొత్త టాక్ షో ‘నిజం విత్ స్మిత’. ఫిబ్రవరి 10 నుంచి ఈ టాక్ షో ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ సోనీ లివ్ లో ప్రసారం అవుతుంది. ఈ టాక్ షో కి మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యాడు. కాగా ఈ ఎపిసోడ్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ షోలో చిరంజీవి తన వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవితంలో.. అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను బయటపెట్టాడు. ఈ క్రమంలోనే తనకి నటన పై ఆసక్తి ఎలా కలిగిందో తెలియజేశాడు.

Nijam With Smitha : దేవుడు నన్ను రక్షిస్తాడని నమ్మాను.. దాని వల్ల రోజంతా భయపడ్డా.. చిరంజీవి!

నేను 10వ తరగతి చదువుతున్న సమయంలో, మా స్కూల్ యానవర్సరీ కోసమని ఒక రూమ్ లో నాటకం రిహార్సల్ జరుగుతుంది. ఆ రూమ్ వైపుగా వెళుతున్న నేను అది వినిపించి, కిటికీలో నుంచి రహస్యంగా చూస్తున్నాను. ఆ రిహార్సల్ లో ఒకడు ఒక చిన్న డైలాగ్ చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు. మా స్కూల్ మాస్టర్ ఏమో ఎదురుగా బెత్తం పట్టుకొని ఆ డైలాగ్ చెప్పిస్తున్నాడు. అది చూసిన నేను ఒక్కసారిగా నవ్వేశాను. నా నవ్వు విన్న ఆ మాస్టర్ కోపంగా నా వైపు చూసి.. ఏ ప్రసాద్ ఇటు రా అన్నారు.

నవ్వినందుకు ఎక్కడ కొడతారో అని భయంతో అయన దగ్గరకి వెళ్ళాను. అప్పుడు ఆయన నన్ను నవ్వినందుకు మందలిస్తూ.. యాక్టింగ్ అంటే ఎగతాళిగా ఉందా? ఏది నువ్వు చెయ్యి అన్నారు. అప్పటికే ఆ డైలాగ్ చాలా సార్లు వినడంతో, నేను పర్ఫెక్ట్ గా చెప్పేశాను. అది చూసిన ఆ మాస్టర్ చాలా బాగా చేసావే అని ఆ క్యారెక్టర్ నాతో చేయించారు. అదే నేను మొదటిసారి నటించడం. అంతేకాదు ఆ యాక్టింగ్ కి స్కూల్ బెస్ట్ యాక్టర్ కూడా అవార్డుని అందుకున్నా, అదే నటుడిగా నా మొదటి అవార్డు. అంతేకాదు ఆ స్కూల్ మ్యాగజైన్ లో కూడా నా ఫోటో పడింది. అప్పటి వరకు జీవితంలో ఏమవుదాం అనే ఒక సందేహంలో ఉన్న నాకు.. ఆ అవార్డు నన్ను నటన వైపు పయనించేలా చేసింది అంటూ చెప్పుకొచ్చాడు.