Nijam With Smitha : ఆ లాకెట్ మిస్ అయ్యింది.. దేవుడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడని చాలా భయపడ్డా: చిరంజీవి

ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ షోల హవా నడుస్తుంది. తాజాగా ఒకప్పటి పాప్ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా 'నిజం విత్ స్మిత' అనే టాక్ షో వస్తుంది. కాగా ఈ టాక్ షో కి మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యాడు. ఈ టాక్ షోలో చిరంజీవి తన వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవితంలో.. అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను బయటపెట్టాడు.

Nijam With Smitha : ఆ లాకెట్ మిస్ అయ్యింది.. దేవుడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడని చాలా భయపడ్డా: చిరంజీవి

Nijam With Smitha chiranjeevi

Updated On : February 10, 2023 / 12:45 PM IST

Nijam With Smitha : ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ షోల హవా నడుస్తుంది. బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోస్ లో ఒక ట్రెండ్ సెట్ చేయడమే కాకుండా ప్రేక్షకుల్లో టాక్ షోల పై ఆసక్తిని కూడా క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో టాక్ షో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఒకప్పటి పాప్ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ షో వస్తుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ సోనీ లివ్ లో ఈ టాక్ షో ప్రసారం అవుతుంది. కాగా ఈ టాక్ షో కి మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యాడు.

Chiranjeevi : ఆ హీరోయిన్లు పట్టించుకోని సినిమాటోగ్రాఫర్‌కి.. ఆపద్బాంధవుడు ఆర్ధిక సాయం!

ఈ టాక్ షోలో చిరంజీవి తన వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవితంలో.. అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను బయటపెట్టాడు. ఈ క్రమంలోనే స్మిత.. సార్ మీరు ఆంజనేయ స్వామిని ఎక్కువుగా నమ్ముతారు. స్వయం కృషితో వచ్చిన మీరు ఈ అదృష్టం, నమ్మకాలు నమ్మవచ్చు అని చెబుతారా? అని ప్రశ్నించింది. దీనికి చిరంజీవి బదులిస్తూ.. నేను వాటిని పూర్తిగా నమ్ముతాను అని చెప్పను, అలాని పూర్తిగా నమ్మను అని చెప్పను. మీకు అర్ధమయ్యేలా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాను.

నేను సినిమాలు కోసమని కుటుంబం నుంచి దూరంగా వచ్చి మద్రాస్ లో ఉంటున్న సమయంలో, నేను ఎటువంటి తప్పుడు దారిలో వెళ్లడం లేదని ఒక మనోధైర్యాన్ని నా తల్లిదండ్రులకు ఇవ్వడానికి.. ఆంజనేయ స్వామిని భక్తితో పూజిస్తూ వచ్చేవాడిని. మీరు నా పాత సినిమాలు గమనిస్తే నా మెడలో ఒక ఆంజనేయ స్వామి లాకెట్ ఉండేది. అది మా నాన్నగారికి ఎక్కడో దొరికితే, దానిని నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. అప్పటిలో ఆ లాకెట్ నన్ను కాపాడుతూ వస్తుంది అని గట్టిగా నమ్మేవాడిని.

అయితే ఒక మూవీ షూటింగ్ సమయంలో ఆ లాకెట్ మిస్ అయ్యింది. అది పోవడంతో దేవుడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడని, నేను ఏదో తప్పు చేశాను అని చాలా భయపడ్డా. ఒక రోజంతా పడుకోలేదు. మళ్ళీ షూటింగ్ సెట్ కి వెళ్లి బాగా వెతికాను. చివరికి దొరికింది, నేను రిలాక్స్ అయ్యాను. మళ్ళీ అన్నయ్య మూవీ షూటింగ్ సమయంలో ఆ లాకెట్ ని ఎవరో దొంగిలించారు. కానీ అప్పుడు నేను భయపడలేదు. ఎందుకంటే దేవుడు అనేది మన నమ్మకం, మన ధైర్యం. అది నీలో ఉన్నంత వరకు నువ్వు దేనికి భయపడనవసరం లేదు. నీకు సాధించాలి అనే గట్టి సంకల్పం ఉంటే.. ఏ దురదృష్టం నీకు అడ్డు రాదు. ఏ అదృష్టం, ఏ దేవుడి సహాయం నీకు అవసరం లేదంటూ ఇప్పటి యువతకి సందేశం ఇచ్చారు.