Chiranjeevi : ఆ హీరోయిన్లు పట్టించుకోని సినిమాటోగ్రాఫర్‌కి.. ఆపద్బాంధవుడు ఆర్ధిక సాయం!

సినీ పరిశ్రమలో ఒకప్పుడు గొప్పగా బ్రతికిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇప్పుడు దీన పరిస్థితిలో సహాయం కోసం వేచి చూస్తున్నారు. పలు ఇంటర్వ్యూలు ద్వారా వీరి పరిస్థితి తెలుసుకున్న ఇండస్ట్రీలోని ప్రముఖులు వారికీ చేయూతను అందిస్తున్నారు. తాజాగా ఒకప్పటి టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ పి దేవరాజ్ పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆర్ధిక సహాయం చేశాడు.

Chiranjeevi : ఆ హీరోయిన్లు పట్టించుకోని సినిమాటోగ్రాఫర్‌కి.. ఆపద్బాంధవుడు ఆర్ధిక సాయం!

Chiranjeevi

Chiranjeevi : సినీ పరిశ్రమలో ఒకప్పుడు గొప్పగా బ్రతికిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇప్పుడు దీన పరిస్థితిలో సహాయం కోసం వేచి చూస్తున్నారు. పలు ఇంటర్వ్యూలు ద్వారా వీరి పరిస్థితి తెలుసుకున్న ఇండస్ట్రీలోని ప్రముఖులు వారికీ చేయూతను అందిస్తున్నారు. తాజాగా ఒకప్పటి టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ పి దేవరాజ్ పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆర్ధిక సహాయం చేశాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో దాదాపు 300 కు పైగా సినిమాలకు కెమెరా మ్యాన్ గా పనిచేసిన దేవరాజ్.. ప్రెజెంట్ ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు.

Chiranjeevi : బ్రహ్మానందం బర్త్ డేని బ్రహ్మాండంగా సెలెబ్రేట్ చేసిన మెగాస్టార్..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దేవరాజ్ మాట్లాడుతూ.. ‘నేను జయప్రద, ప్రభ, విజయశాంతి వంటి హీరోయిన్ లకు ఎన్నో సినిమాలు రికమెండ్ చేశాను. కానీ వాళ్ళు ఎవరు నాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. నా స్నేహితుడు రజినీకాంత్ నెలకి రూ.5000 ఖర్చులకు పంపిస్తాడు. నటుడు మురళీ మోహన్ టాబ్లెట్స్ కోసం ఒక రూ.3000 పంపిస్తాడు. నాకు ఆపరేషన్ చేయాలి. అందుకు సుమారు 7 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం నేను ఇంటి అద్ది కూడా కట్టలేని స్థితిలో ఉన్నాను. నేను ఎందుకు బ్రతికి ఉన్నానో తెలియక చచ్చిపోవాలి అనిపిస్తుంది’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

ఇక ఆయన పరిస్థితిని తెలుసుకున్న చిరంజీవి ఆయన పాలిట ఆపద్బాంధవుడులా నిలిచాడు. మాన‌వ‌సేవే మాధవ సేవ అని మ‌న‌సావాచా న‌మ్మే చిరంజీవి, దేవరాజ్ కి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం చేశాడు. ఇక ఈ వార్త తెలుసుకున్న మెగా అభిమానులు జై చిరంజీవ అంటున్నారు. కాగా ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు కూడా త‌న ఉదార‌త చాటుకున్నారు. పాకీజా పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న నటి ‘వాసుకి’ ఆర్ధిక పరిస్థితి ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్న నాగబాబు లక్ష రూపాయిలు సాయం అందించాడు.

Chiranjeevi

Chiranjeevi