Chiranjeevi : బ్రహ్మానందం బర్త్ డేని బ్రహ్మాండంగా సెలెబ్రేట్ చేసిన మెగాస్టార్..

హాస్యానికి కూడా రూపం ఉంటుంది అంటే అది బ్రహ్మానందం రూపంలో ఉంటుందేమో అనేలా బ్రహ్మి తన కామిక్ టైమింగ్ తో మనందర్నీ అలరిస్తూ వస్తున్నాడు. ఇక ఈరోజు (ఫిబ్రవరి 1) బ్రహ్మానందం బర్త్ డే కావడంతో సోషల్ మీడియా అంతా సందడి సందడిగా ఉంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా బ్రహ్మానందంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి స్వయంగా బ్రహ్మి ఇంటికి వెళ్ళాడు.

Chiranjeevi : బ్రహ్మానందం బర్త్ డేని బ్రహ్మాండంగా సెలెబ్రేట్ చేసిన మెగాస్టార్..

Chiranjeevi

Chiranjeevi : హాస్యానికి కూడా రూపం ఉంటుంది అంటే అది బ్రహ్మానందం రూపంలో ఉంటుందేమో అనేలా బ్రహ్మి తన కామిక్ టైమింగ్ తో మనందర్నీ అలరిస్తూ వస్తున్నాడు. తన చూపులతోనే హాస్యాన్ని పండించగల బ్రహ్మి ప్రేక్షకుల చేత ‘హాస్యబ్రహ్మ’ అని పిలిపించుకుంటున్నాడు. ఇక ఈరోజు (ఫిబ్రవరి 1) బ్రహ్మానందం బర్త్ డే కావడంతో సోషల్ మీడియా అంతా సందడి సందడిగా ఉంది. తమ మీమ్ గాడ్ కి బర్త్ డే విషెస్ చెబుతూ అర్ధరాత్రి 12 గంటల నుంచే రకరకాల మీమ్స్ చేస్తున్నారు మీమర్స్. ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా బ్రహ్మానందంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి స్వయంగా బ్రహ్మి ఇంటికి వెళ్ళాడు. బ్రహ్మానందంకి ఫ్లవర్ బొకే ఇచ్చి విషెస్ తెలియజేశాడు. ఆ ఫోట్లను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తనకి తెలిసిన బ్రహ్మానందం గురించి చెప్పుకొస్తూ మరోసారి విషెస్ చెప్పాడు.

Brahmanandam in Keedaa Cola : వీల్ చైర్‌లో బ్రహ్మి కామెడీ.. మీమ్ క్రియేటర్ డైరెక్షన్‌లో మీమ్ గాడ్..

‘నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఒక లెక్చరర్. ఈ రోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కెక్కిన ఒక గొప్ప హాస్య నటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చెయ్యక్కర్లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మానందానికి హృదయ పూర్వక శుభాభినందనలు. బ్రహ్మానందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ,పదిమందిని నవ్విస్తూ వుండాలని, బ్రహ్మానందంకి మరింత బ్రహ్మాండమైన భవిష్యత్తు వుండాలని, తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మానందకరంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, తనకి నా జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ తెలియజేశాడు.

కాగా గత కొంత కాలంగా సినిమాల్లో పెద్దగా కనిపించని బ్రహ్మానందం.. తరుణ్ భాస్కర్ కొత్త ప్రాజెక్ట్ ‘కీడా కోలా’లో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలియజేశాడు దర్శకుడు. ఈ మూవీలో బ్రహ్మి.. ముసలివాడిగా యూరిన్ బాగ్ అటాచ్‌మెంట్ తో వీల్ చైర్ కే అంకితమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ‘పేరు వరద పోసేది పితుకంత’ అనే స్టేట్‌మెంట్ ఇచ్చి క్యారెక్టర్ ఏంటో చెప్పేశాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇక ఈ న్యూస్ తెలిశాక ఎప్పుడెప్పుడు ‘వరదరాజు’ని చూస్తామా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.