ఏప్రిల్ 8తో నాది ఎమోషనల్ అటాచ్‌మెంట్.. మెగాస్టార్ చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి ఏప్రిల్ 8వ తేదీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు..

మెగాస్టార్ చిరంజీవి ఏప్రిల్ 8వ తేదీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు..
ఏప్రిల్ 8.. ఈ తేదీతో నాకు బోలెడంత అనుబంధం ఉంది.. సశేషం.. తర్వాత చెబుతా.. అంటూ ఇటీవల చిరంజీవి చేసిన ట్వీట్ అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఏప్రిల్ 8 ఏమై ఉంటుందబ్బా అంటూ ఈ ట్వీట్ గురించి మెగాభిమానులు ఆసక్తికరంగా చర్చించుకున్నారు. ఈ రోజు (ఏప్రిల్ 8)తో తనుకున్న అనుబంధమేంటో వరుస ట్వీట్ల ద్వారా తాజాగా వెల్లడించారు చిరంజీవి.
‘ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామితో చిన్నప్పటి నుంచి నాకు చాలా అనుబంధం ఉంది.1962లో నాకు ఓ లాటరీలో ఈ బొమ్మ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది. దాన్ని ఎందుకు అంత భద్రంగా దాచుకున్నానో తెలుసా? ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మను చూసిన మా నాన్న గారు, ‘‘ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీలాగానే ఉన్నాయి’’ అన్నారు.
Read Also : బన్నీనువ్వు బాగుండాలబ్బా.. అకీరా అందరికంటే ఎదిగిపోయాడు.. అఖిల్ మాకు మరో కొడుకు..
‘కొన్ని దశాబ్దాల తరవాత.. 2002 లో బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను దానిని పాలరాతి మీద అచ్చు వేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? ‘‘ఏంటోనండి …బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి.. అలానే ఉంచేసాను.. మార్చలేదు’’ అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు’ అంటూ చిరు తనకు ఏప్రిల్ 8తో తనకున్న అనుబంధాన్ని వివరించారు.
ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది…చిన్నప్పటి నుంచి…1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?…to be continued pic.twitter.com/TdVKjg05nS
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020
ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, “ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి” అన్నారు. అప్పటి నా ఫోటో.. ..to be continued pic.twitter.com/HnpRnezH8E
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020
బాపు గారు చెప్పిన మాట “ఏంటోనండి …బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి …అలానే ఉంచేసాను …మార్చలేదు ” అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఇవ్వాల్టి తారీఖుతో కూడా నాకు అనుబంధం ఉంది…#8thApril …to be continued. pic.twitter.com/m3J6S1ZEMs
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020