Chiranjeevi – Manchu Vishnu : ఇటు రేవంత్ రెడ్డితో చిరంజీవి.. అటు భట్టి విక్రమార్కతో మంచు విష్ణు..

తాజాగా రేవంత్ రెడ్డి - చిరంజీవి కలయిక, అటు మంచు విష్ణు - భట్టి విక్రమార్క కలయిక వైరల్ గా మారింది.

Chiranjeevi Revanth Reddy Meet and Bhatti Vikramarka Manchu Vishnu Meet Photos goes Viral

Chiranjeevi – Manchu Vishnu : తెలంగాణలో(Telangana) కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని(Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని(Bhatti Vikramarka), సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి – చిరంజీవి కలయిక, అటు మంచు విష్ణు – భట్టి విక్రమార్క కలయిక వైరల్ గా మారింది.

చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చినందుకు నిన్న రాత్రి స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్లారు. రేవంత్ రెడ్డి చిరంజీవిని అభినందించి కాసేపు ముచ్చటించారు. వీరిద్దరి ఫోటోలు నిన్న రాత్రి నుంచి వైరల్ గా మారాయి. నేడు ఉదయం తెలంగాణ ప్రభుత్వం తరపున పద్మ అవార్డుకి ఎంపికైన వారికి సన్మాన సభ నిర్వహించగా అక్కడ కూడా ఒకే వేదికపై చిరంజీవి – రేవంత్ రెడ్డి కలిశారు.

Also Read : Shiva Rajkumar : శివన్న నా కోసం బెంగుళూరు నుంచి వచ్చారు.. మెగాస్టార్‌తో శివరాజ్ కుమార్ భేటీ..

ఇక మరోవైపు హీరో మంచు విష్ణు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని కలిశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున మంచు విష్ణు, శివబాలాజీ, రఘుబాబు.. భట్టి విక్రమార్కని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో రేవంత్ రెడ్డి చిరంజీవి మీట్ ఫోటోలు, భట్టి – విష్ణు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.