Shiva Rajkumar : శివన్న నా కోసం బెంగుళూరు నుంచి వచ్చారు.. మెగాస్టార్‌తో శివరాజ్ కుమార్ భేటీ..

తాజాగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ బెంగుళూరు నుంచి చిరంజీవి ఇంటికి వచ్చి చిరంజీవిని అభినందించారు. అనంతరం ఆయనతో ముచ్చటించి చిరంజీవి ఇంట్లోనే భోజనం చేసి వెళ్లారు.

Shiva Rajkumar : శివన్న నా కోసం బెంగుళూరు నుంచి వచ్చారు.. మెగాస్టార్‌తో శివరాజ్ కుమార్ భేటీ..

Kannada Star Shiva Rajkumar Meets and Felicitate Megastar Chiranjeevi for Selecting to Padma Vibhushan Award

Updated On : February 4, 2024 / 5:07 PM IST

Shiva Rajkumar : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇటీవల పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా పలువురు సినీ ప్రముఖులు వచ్చి మెగాస్టార్ ని అభినందిస్తున్నారు. గత వారం రోజులుగా చిరంజీవి ఇంటికి పలువురు ప్రముఖులు తరలి వెళ్తున్నారు. ఇక నిన్న ఉపాసన స్పెషల్ పార్టీ నిర్వహించగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ పార్టీకి వచ్చారు.

నేడు ఉదయం చిరంజీవితో పాటు మిగిలిన పద్మ అవార్డులకు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానం చేసింది. తాజాగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ బెంగుళూరు నుంచి చిరంజీవి ఇంటికి వచ్చి చిరంజీవిని అభినందించారు. అనంతరం ఆయనతో ముచ్చటించి చిరంజీవి ఇంట్లోనే భోజనం చేసి వెళ్లారు.

Also Read : Bhagavanth Kesari : బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్న తమిళ్, కన్నడ స్టార్ హీరోలు?

శివన్నతో కలిసి దిగిన ఫోటోలని చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా బ్రదర్ శివ రాజ్ కుమార్ నన్ను అభినందించడానికి బెంగుళూరు నుంచి నా కోసం వచ్చారు. ఆయనతో కొంచెం సమయం గడిపి, లంచ్ చేసి, ఆయన తండ్రి రాజ్ కుమార్ గారు, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న అనుబంధాలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాము అని తెలిపారు. దీంతో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనపడటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.