Bhagavanth Kesari : బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్న తమిళ్, కన్నడ స్టార్ హీరోలు?

భగవంత్ కేసరి సినిమా రీమేక్ రైట్స్ కోసం వేరే సినీ పరిశ్రమల సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడుతున్నారని టాక్ నడుస్తుంది.

Bhagavanth Kesari : బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్న తమిళ్, కన్నడ స్టార్ హీరోలు?

Rajinikanth Shiva Rajkumar Vijay wants to do Balakrishna Bhagavanth Kesari Movie Remake

Updated On : February 4, 2024 / 4:01 PM IST

Bhagavanth Kesari : బాలకృష్ణ(Balakrishna), కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా గత సంవత్సరం దసరాకు రిలీజయ్యి మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఆల్మోస్ట్ 120 కోట్లకు పైగా వసూలు చేసింది. ఎప్పుడూ కామెడీ సినిమాలు తీసే అనిల్ రావిపూడి(Anil Ravipudi) మహిళా శక్తి అనే మెసేజ్ తో ఈ సినిమాని తీయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఒక కూతురు ఏ ఆపద వచ్చినా తట్టుకొని నిలబడాలి, మహిళ ధృడంగా ఉండాలి అనే కథాంశంతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే పాయింట్ ని కూడా చూపిస్తూనే భగవంత్ కేసరి సినిమాని బాలకృష్ణ హీరోయిజం కూడా పెట్టి కమర్షియల్ సినిమాగా చూపించారు. దీంతో ఈ సినిమా మహిళలకు బాగా కనెక్ట్ అయింది. అయితే భగవంత్ కేసరి సినిమా రీమేక్ రైట్స్ కోసం వేరే సినీ పరిశ్రమల సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడుతున్నారని టాక్ నడుస్తుంది.

Also Read : Klin Kaara : చరణ్ కూతురు క్లీంకార కేర్ టేకర్‌కి జీతమెంతో తెలుసా?

ఈ సినిమాలో బాలకృష్ణ ఏజ్ కి తగ్గ పాత్రగా శ్రీలీలకు(Sreeleela) తండ్రి పాత్ర పోషించారు. దీంతో తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ట్రై చేస్తున్నారని సినీ పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా ఈ సినిమా రైట్స్ తీసుకుందామని అనుకుంటున్నారట. ప్రస్తుతం విజయ్ 69వ సినిమా చేస్తున్నారు. ఇటీవలే అధికారికంగా పార్టీ ప్రకటించి 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమా అయ్యాక 70వ సినిమాగా భగవంత్ కేసరి రీమేక్ చేస్తే పొలిటికల్ గా కలిసొస్తుంది అని, మహిళల సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని విజయ్ భావిస్తున్నట్టు సమాచారం. మరి బాలయ్య బాబు భగవంత్ కేసరి సినిమా ఏ భాషలో ఏ హీరో రీమేక్ చేస్తారో చూడాలి.