Shankar Dada MBBS : ముందుంది ‘శంకర్ దాదా’ రీ రిలీజ్ పండుగ.. కొత్త ట్రైలర్ చూశారా..?

నవంబర్ 4న రీ రిలీజ్ కాబోతున్న ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

Shankar Dada MBBS : ముందుంది ‘శంకర్ దాదా’ రీ రిలీజ్ పండుగ.. కొత్త ట్రైలర్ చూశారా..?

Chiranjeevi Shankar Dada MBBS Re Release trailer

Shankar Dada MBBS Re Release : టాలీవుడ్ ప్రేక్షకులంతా ఒకటిగా ఎదురు చూస్తున్న రీ రిలీజ్‌ల్లో ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ సినిమా కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కామెడీ అండ్ ఎమోషనల్ చిత్రంగా 2004లో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించింది. బాలీవుడ్ మూవీ ‘మున్నా భాయ్ ఎంబిబిఎస్’కి ఇది రీమేక్ గా వచ్చిన ఈ సినిమాని జయంత్ పరాంజీ డైరెక్ట్ చేశాడు. సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. శంకర్ దాదాగా చిరంజీవి, ఏటీఎంగా శ్రీకాంత్ చేసిన సందడి అంతాఇంతా కాదు.

ఈ సినిమాలో చిరంజీవి ఇంగ్లీష్ పదాలతో తెలుగు సమేతులు చెబుతుంటే థియేటర్స్ లో ఆడియన్స్ అంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. అలాగే లైఫ్ జర్నీలో మనిషి ఎదుర్కొనే అనేక ఎమోషన్స్ ని అందరి మనసుని హత్తుకునేలా చూపించారు. ఇక ఈ సినిమాకి మరో హైలైట్ అంటే.. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్. ఈ రీ రిలీజ్ తో థియేటర్స్ అన్ని మ్యూజికల్ కాన్సర్ట్ గా, కామెడీ కార్నివాల్‌ గా మారిపోనున్నాయి. నవంబర్ 4న రీ రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దానివైపు ఒక లుక్ వేసేయండి.

Also read : వరుణ్, లావణ్య శుభలేఖ చూశారా.. మ్యారేజ్, రిసెప్షన్ డేట్ ఎప్పుడంటే..?