Chiarnjeevi
Chiarnjeevi : చిరంజీవికి నేటికి 70 ఏళ్ళు. సినీ పరిశ్రమలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడి మెగాస్టార్ గా ఎదిగారు. ఇప్పటికి ఈ జనరేషన్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు తీస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఆయన డబ్బు, హోదా, స్టార్ డమ్ అన్ని చూసేసారు. సినిమాల్లో డిఫరెంట్ పాత్రలతో అదరగొట్టారు. తన డ్యాన్స్, ఫైట్స్ తో ట్రెండ్ సెట్ చేసారు.(Chiarnjeevi)
నేడు మెగాస్టార్ పుట్టిన రోజు కావడంతో ఆయన అభిమానులు, అనేకమంది సినిమా సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి సంబంధించిన విషయాలు వైరల్ గా మారాయి. అయితే సినీ పరిశ్రమలో ఎన్నో గెలిచిన ఈ మగధీరుడికి ఓ లోటు మాత్రం ఉంది. గతంలో చిరంజీవే స్వయంగా తెలిపారు. ఇటీవల దానిపై ఇండైరెక్ట్ గా కూడా కామెంట్స్ చేసారు.
గతంలో చిరంజీవి ఎంత మాస్ కమర్షియల్ హీరో అయినా రుద్రవీణ, ఆపద్బాంధవుడు, స్వయంకృషి, డాడీ.. లాంటి ఎమోషనల్ సినిమాలతో కూడా అలరించారు. అయితే చిరంజీవి.. అలాంటి పాత్రలు ఎక్కువ చేయలేకపోయాను, మాస్ కమర్షియల్ హీరోనా పేరు వచ్చింది కానీ చరిత్రలో నిలిచిపోయే పాత్రలు తక్కువ చేశాను అని సైరా ప్రమోషన్స్ టైంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇటీవల కుబేర సినిమా సక్సెస్ మీట్ లో కూడా ధనుష్ బెగ్గర్ వేషం గురించి మాట్లాడుతూ అలాంటి పాత్రలు చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ పాత్రల గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడారు. దీంతో చిరంజీవికి ఎక్కువ ఎమోషనల్ పాత్రలు చేయలేదు అనే లోటు ఇప్పటికి ఉందేమో అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చిరు మాస్ ఇమేజ్ సినిమాలే చేస్తున్నారు. మరి ఎమోషనల్ పాత్రలు మున్ముందు చేసి ఆయన లోటుని తీర్చుకుంటారేమో చూడాలి.
Also Read : Meghalu Cheppina Prema Katha : ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ మూవీ రివ్యూ.. మ్యూజికల్ లవ్ స్టోరీ..