త్రిష తప్పుకుందని తెలిసి షాకయ్యాను.. అసలు కారణం చెప్పిన చిరు..
‘ఆచార్య’ సినిమా నుంచి త్రిష తప్పుకోవడం గురించి కారణాలు వివరించిన చిరంజీవి..

‘ఆచార్య’ సినిమా నుంచి త్రిష తప్పుకోవడం గురించి కారణాలు వివరించిన చిరంజీవి..
చిరంజీవి, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఇటీవల చెన్నై పొన్ను త్రిష సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘సైరా’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రమిది.
ఈ సినిమాలో కథానాయికగా త్రిషను ఫిక్స్ చేశారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ చిత్రంలో తాను నటించడం లేదని త్రిష తెలిపింది. తాజాగా ఆమె సినిమా ఎందుకు తప్పుకుందనే విషయం గురించి చిరు క్లారిటీ ఇచ్చారు. ‘‘ఆచార్య నుంచి త్రిష తప్పుకుందని తెలిసి నేను షాకయ్యాను. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తున్న నా కూతురు సుస్మిత.. త్రిష కోసం దుస్తులు కూడా సిద్ధం చేసింది. త్రిషతో సమస్యేంటి అని మా టీమ్ అందరినీ అడిగాను. నిజానికి ఆమెకు ఎవరితోనూ సమస్యలు లేవు. అసలు నిజమేమిటంటే.. మణిరత్నం సినిమాకు ఆమె వరుసగా డేట్లు ఇచ్చింది. అందువల్లే ఆచార్య నుంచి తప్పుకుంది. అంతే తప్ప మరో కారణం లేదు’’ అని చిరంజీవి తెలిపారు.
Read Also : బాలీవుడ్ బంటీ.. ఇద్దరిలో ఎవరు?
కరోనా కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. స్వయంగా చిరునే వివరణ ఇవ్వడంతో ఈ కాంట్రవర్సీకి తెరపడింది. చిరు, త్రిష కలిసి ‘స్టాలిన్’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.‘ఆచార్య’లో కాజల్ అగర్వాల్ కథానాయికగా ఫిక్స్ అయింది. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.