×
Ad

Chiranjeevi Venkatesh : కొండవీటి రాజా – బొబ్బిలి రాజా ఒకే ఫ్రేమ్ లో.. టైగర్ మోడల్ డ్రెస్ లో.. ఫొటో వైరల్..

తాజాగా సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. (Chiranjeevi Venkatesh)

Chiranjeevi Venkatesh

Chiranjeevi Venkatesh : మన హీరోలు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ కి, సినిమా లవర్స్ కి పండగే. ఆ ఫోటోలు వైరల్ అవ్వాల్సిందే. తాజాగా సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఇటీవల 80s నటీనటుల రీ యూనియన్ పార్టీ చెన్నైలో జరిగిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి తెలుగు నుంచి కూడా చాలా మంది స్టార్స్ హాజరయ్యారు.(Chiranjeevi Venkatesh)

చిరంజీవి, వెంకటేష్ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీకి వెళ్లేముందు చార్టెడ్ ఫ్లైట్ లో ఈ ఇద్దరూ కలిసి దిగిన ఫొటో వైరల్ అయింది. అక్కడికి వెళ్ళాక ఈ ఇద్దరూ మరోసారి స్టైలిష్ లుక్స్ తో దిగిన ఫొటో వైరల్ గా మారింది. ఈ సారి 80s రీ యూనియన్ టైగర్ మోడల్ డ్రెస్ లతో సాగింది. దీంతో పులి చర్మంలా కనిపించే బట్టలు వేసుకున్నారు అంతా. వెంకీమామ, చిరంజీవి కూడా అలాంటి డ్రెస్ లే వేసుకున్నారు.

Also Read : Bunny Vasu : డిగ్రీ అవ్వకుండానే పీజీ చేసిన నిర్మాత.. ఇన్నేళ్ల తర్వాత ఫెయిల్ అయిన సబ్జెక్టు కోసం మళ్ళీ చదువు బాట..

ఆ డ్రెస్ లో ఈ ఇద్దర్ని చూసి బొబ్బిలి రాజా, కొండవీటి రాజా అని వాళ్ళ సినిమాల పేర్లతో సరదాగా కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ ఇద్దరూ మంచి కథ వస్తే కలిసి సినిమా చేస్తామని ఇప్పటికే పలు మార్లు చెప్పారు. వెంకటేష్ అయితే.. చిరంజీవి పెద్ద డాన్ పాత్రలో నేను ఆయన వెనకాల నిల్చొనే పాత్రలో చేయాలని ఉందన్నారు. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

Also Read : Rashmika Vijay : రష్మిక – విజయ్.. ఎవరి ఆస్తి ఎన్ని కోట్లు తెలుసా? ఎవరిది ఎక్కువ? ఎవరికి ఏం బిజినెస్ లు ఉన్నాయి?