Bunny Vasu : డిగ్రీ అవ్వకుండానే పీజీ చేసిన నిర్మాత.. ఇన్నేళ్ల తర్వాత ఫెయిల్ అయిన సబ్జెక్టు కోసం మళ్ళీ చదువు బాట..

తాజాగా బన్నీ వాసు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్టడీ గురించి తెలిపారు.(Bunny Vasu)

Bunny Vasu : డిగ్రీ అవ్వకుండానే పీజీ చేసిన నిర్మాత.. ఇన్నేళ్ల తర్వాత ఫెయిల్ అయిన సబ్జెక్టు కోసం మళ్ళీ చదువు బాట..

Bunny Vasu

Updated On : October 6, 2025 / 7:09 AM IST

Bunny Vasu : కొంతమంది పలు కారణాలతో చదువుని మధ్యలోనే వదిలేస్తారు. కానీ చదువుకోవాలి, వదిలేసింది పూర్తి చేయాలి అని ఎంత ఏజ్ వచ్చినా చదువుతారు. అలా నిర్మాత బన్నీ వాసు ఇప్పుడు ఒక సబ్జెక్టు కోసం మళ్ళీ చదువుతున్నారట. తాజాగా బన్నీ వాసు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్టడీ గురించి తెలిపారు.(Bunny Vasu)

బన్నీ వాసు మాట్లాడుతూ.. వైజాగ్ లో గాయత్రీ కాలేజీలో చదివాను డిగ్రీ. ఒక సబ్జెక్ట్ లాస్ట్ ఇయర్ లో మిగిలింది. అప్పుడు మణిపాల్ యూనివర్సిటీలో ఒక ఫెసిలిటీ ఉండేది. డిగ్రీ అవ్వకపోయినా పీజీ చేయొచ్చు. కానీ పీజీ అయ్యేలోపు ఆ డిగ్రీ సబ్జెక్ట్స్ పూర్తి చేయాలి. దాంతో ఢిల్లీలో పీజీ జాయిన్ అయ్యాను. అయితే నాకు అక్కడ పీజీ పూర్తయింది కానీ ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వలేదు.

Also Read : Mahesh Babu : మళ్ళీ చనిపోతాడని రాజీవ్ కనకాలను వద్దన్న మహేష్ బాబు.. కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ హిట్..

ఆ సబ్జెక్టు ఇవ్వాళ్టికి అలాగే ఉంది. మధ్యలో నేను పాస్ అయ్యానేమో అనుకోని వదిలేసా. ఎప్పుడో ఓ పదేళ్ల తర్వాత సర్టిఫికెట్స్ కోసం వెళ్తే తెలిసింది నేను ఆ సబ్జెక్టు ఇంకా పాస్ అవ్వలేదని. దాంతో డిగ్రీ అవ్వలేదని పీజీ సర్టిఫికెట్స్ కూడా రాలేదు. ఇప్పుడు ఆ సబ్జెక్టు పూర్తి చేయాలని చూస్తున్నాను. ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ చదివి రాయాలి. అంత టైం లేకపోయినా ఏదో ఒకటి చదివి ఆ సబ్జెక్ట్ పూర్తిచేయాలి అని అన్నారు.

బన్నీ వాసు ఇప్పుడున్న పొజిషన్ కి చదువుతో, సర్టిఫికెట్ తో సంబంధం లేదు, అవసరం కూడా లేదు అయినా చదివి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలనుకోవడం గ్రేట్ అని అంటున్నారు. మరి ఆయనకు ఉన్న బిజీలో ఎప్పుడు చదివి పాస్ అవుతారో చూడాలి.

Also Read : Allu Arjun : ఆ డైరెక్టర్ దగ్గర 2D యానిమేషన్ నేర్చుకోడానికి వెళ్లిన అల్లు అర్జున్.. అక్కడ మొదలయ్యారు అంతా..