Allu Arjun : ఆ డైరెక్టర్ దగ్గర 2D యానిమేషన్ నేర్చుకోడానికి వెళ్లిన అల్లు అర్జున్.. అక్కడ మొదలయ్యారు అంతా..
ఈ విషయాన్ని తాజాగా నిర్మాత బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. (Allu Arjun)

Allu Arjun
Allu Arjun : అల్లు అర్జున్ నటుడిగానే అతని ప్రయాణం మొదలుపెట్టాడని అని అంతా అనుకుంటారు. కానీ అంతకు ముందు యానిమేషన్ కూడా నేర్చుకున్నాడు. బన్నీకి యానిమేషన్ లో కూడా ప్రవేశం ఉంది. ఈ విషయాన్ని తాజాగా నిర్మాత బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. బన్నీ వాసు – అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. అసలు వాళ్లిద్దరూ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, ఎలా క్లోజ్ అయ్యారు అని ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.(Allu Arjun)
బన్నీ వాసు మాట్లాడుతూ.. నేను 3D యానిమేటర్ గా పనిచేసేవాడిని. డైరెక్టర్ మారుతీ 2D యానిమేటర్ గా పనిచేసేవాడు. మేము ఇద్దరం మొదట ఫ్రెండ్స్. మాతో డైరెక్టర్ సుధీర్ వర్మ కూడా ఉండేవాడు. బన్నీ మారుతీ దగ్గరకు 2D యానిమేషన్ నేర్చుకోడానికి వచ్చేవాడు. అలా వాళ్లిద్దరూ పరిచయం అయ్యారు. అయితే నాకు మొదట అల్లు అర్జున్ వాళ్ళ అన్నయ్య బాబీ పరిచయం అయ్యారు వేరే ఫ్రెండ్ ద్వారా. జానీ సినిమాకు నేను, మారుతీ కలిసి కొన్ని డిజైన్స్ చేశాం. అలా అల్లు అరవింద్ గారి వల్లే మేము గీతా ఆర్ట్స్ లోకి ఎంటర్ అయ్యాం.
అప్పుడు గంగోత్రి సినిమా అవుతుంది. బాబీ నా దగ్గరకు వచ్చి ఇలా సినిమా జరుగుతుంది. తమ్ముడికి అన్ని చూసుకోడానికి కావాలి అని నన్ను అడిగారు. నాకు పక్కన జాబ్ ఉంది బాగానే ఉంది అనుకున్నాను కానీ ఎందుకో ఓకే చెప్పి వెళ్ళాను. అలా బన్నీ దగ్గరకు ఎంటర్ అయ్యాను. ఆర్య ముందు దిల్ రాజుకి బన్నీకి మధ్యలో కో ఆర్డినేట్ గా నన్ను పెట్టారు. అలా ఆర్య సినిమాకు ఫుల్ గా బన్నీ కోసం పనిచేసాను. ఆర్య సినిమా గోదావరి జిల్లా రైట్స్ నేను కొన్నాను. అక్కడ్నుంచి అందరూ పరిచయం అయ్యారు. అక్కడ్నుంచి బన్నీతో నా ప్రయాణం సాగుతుంది అని తెలిపాడు.
బన్నీ వాసు
అలా అప్పట్నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూనే బన్నీ పక్కనే ఉండి అన్ని చూసుకున్నాను అని, ఆర్య సినిమా నుంచే నా పేరు బన్నీ వాసుగా మారిందని, బన్నీ నాకు అతనితో పాటు సమానంగా విలువ ఇస్తాడని, వేరే వాళ్ళు ఎవరైనా నా గురించి నెగిటివ్ గా చెప్పినా వాళ్లకు కౌంటర్ ఇచ్చేలా సమాధానం ఇస్తాడని ఓ సంఘటన కూడా చెప్పుకొచ్చాడు బన్నీ వాసు. బన్నీ వాసు, మారుతీ, నిర్మాత SKN, శ్రేయాస్ శ్రీనివాస్.. ఇలా ఈ బ్యాచ్ అంతా ఆర్య, గంగోత్రి సినిమా మధ్యలో పరిచయం అయి అక్కడ్నుంచి ప్రయాణం చేసి ఇవాళ అందరూ మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు.
Also Read : Bunny Vasu : చిరంజీవి భార్యకు బాకీ ఉన్న బన్నీ వాసు.. 20 ఏళ్ళ క్రితం తీసుకొని.. ఎంతో తెలుసా?