Chiranjeevi-Venkatesh participated in the shoot of Mana Shankara Varaprasad gaaru movie
Chiru-Venky: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత చిరు-అనిల్ కాంబోలో రాబోతున్న సినిమా (Chiru-Venky)కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఏర్పడుతున్నాయి. ఇక, చాలా కాలం తరువాత వింటేజ్ చిరంజీవిలోకి ఆ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా కోసం ఫుల్లుగా వాడేసుకుంటున్నాడట అనిల్. దాంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని మెగా ఫ్యాన్స్ తో పాటు, నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Prabhas Birthday : ప్రభాస్ బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన ప్రభాస్ చెల్లి..
ఇదిలా ఉంటే, మన శంకర్ వరప్రసాద్ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నాడు అంటూ ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అది ఒక స్పెషల్ రోల్ అని కూడా హింట్ ఇచ్చారు. దాంతో, ఈ సినిమాపై హైప్ డబుల్ అయ్యింది. తాజాగా, విక్టరీ వెంకటేష్ మన శంకర్ వరప్రసాద్ సెట్స్ కి వచ్చి షూట్ లో పాల్గొన్న వీడియోలో విడుదల చేశారు మేకర్స్. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ ను ఆహ్వానిస్తూ ఎక్స్ లో ఈ వీడియోను విడుదల చేశారు. ఇద్దరు హీరోల సూపర్ హిట్స్ సినిమాల నుంచి సూపర్ షాట్స్ ని యాడ్ చేసి అదిరిపోయే వీడియోను రిలీజ్ చేశారు. ఇక లాస్ట్ ఈ సినిమా సెట్స్ లో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న షాట్ తో వీడియోను ఎండ్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. మరి ఇంట్రో వీడియోనే ఈ రేంజ్ లో ఉందంటే ఫుల్ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతోందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మన శంకర వరప్రసాద్ గారు సినిమా 2026 సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన భీమ్స్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా పండక్కి ఎలాంటి వినోదాన్ని పంచుతుందో చూడాలి.
Welcoming my dear friend, Victory @VenkyMama to our #ManaShankaraVaraPrasadGaru Family 💐💐💐
Let’s celebrate the joy this Sankranthi 2026 in theatres 🤗 pic.twitter.com/3kITC2RlBU
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2025