Vishwambhara : మొదలైన ‘విశ్వంభర’ యాక్షన్ సీక్వెన్స్ ప్లానింగ్.. ఫైట్ మాస్టర్స్ ఎవరో తెలుసా..?

చిరంజీవి 'విశ్వంభర' యాక్షన్ సీక్వెన్స్ ప్లానింగ్ మొదలయింది. ఫైట్ మాస్టర్స్ ఎవరో తెలుసా..?

Chiranjeevi Vishwambhara Action Choreography discussions started with fight masters

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి, బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ కలయికలో ‘విశ్వంభర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కబోతున్న ఈ సినిమా.. థ్రిల్లింగ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో, అబ్బురపరిచే గ్రాఫిక్స్‌తో ఆడియన్స్ కి కన్నులు విందు కానుందట. ఇక ఈ మూవీ కోసం చిత్ర యూనిట్.. పక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో ముందుకు సాగుతుంది.

ఆర్ట్ వర్క్ నుంచి యాక్షన్ పార్ట్ వరకు అంతా ముందుగానే డిజైన్ చేసుకొని సెట్స్ పైకి వెళ్తున్నారు. ఈక్రమంలోనే మూవీలో దాదాపు 13 సెట్స్ కి సంబంధించిన ప్రీ డిజైన్ సెక్షన్స్ జరిగాయట. ఇక తాజాగా యాక్షన్ పార్ట్ ని డిజైన్ చేసేందుకు ఫైట్ మాస్టర్స్ తో దర్శకుడు వశిష్ఠ, సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు పాల్గొని చర్చలు జరిపారు. ఇంతకీ ఈ సినిమాకి యాక్షన్ పార్ట్ డిజైన్ చేయబోతున్న ఫైట్ మాస్టర్స్ ఎవరంటే.. యాక్షన్ డియో రామ్ లక్ష్మణ్.

Also read : Fahadh Faasil : ప్రొద్దటూరు హోటల్‌లో పుష్ప విలన్ ఫహద్.. భోజనం చేసి సరదాగా ఆటోలో ప్రయాణం..

ఈ అప్డేట్ ని ఇస్తూ మూవీ టీం ఒక ఫొటోతో ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి అయ్యిపోయాయి. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ మూవీలో చిరంజీవితో పాటు నటించబోయే ఇతర నటీనటులు ఎవరు అన్నది మాత్రం క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి విలన్ గా నటించబోతున్నారని, అలాగే త్రిష ఫిమేల్ లీడ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మూవీ టీం టైం ఫిక్స్ చేసుకుంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణని మారేడుమిల్లి అడవుల్లో మొదలయింది. అయితే చిరంజీవి మాత్రం.. ఇప్పటివరకు ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టలేదు. చిరంజీవి అభిమానులు మాత్రం.. ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి చిరు ఈ సెట్స్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాలి.