Fahadh Faasil : ప్రొద్దటూరు హోటల్‌లో పుష్ప విలన్ ఫహద్.. భోజనం చేసి సరదాగా ఆటోలో ప్రయాణం..
ఆంధ్రప్రదేశ్ 'ప్రొద్దటూరు' హోటల్‌లో పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ సందడి. భోజనం చేసి సరదాగా ఆటోలో ప్రయాణం..

Pushpa villain Fahadh Faasil at andhra pradesh proddatur video viral
Fahadh Faasil : మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్.. ప్రస్తుతం తెలుగులో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ లో ఒక అరగంట మాత్రమే కనిపించిన ఫహద్.. తన నటనతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. ఆ తరువాత వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’లో కూడా నటించి మెప్పించారు. దీంతో ఫహద్ యాక్టింగ్ కి ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు.
ఇక అప్పటినుంచి ఫహద్ నటించిన పలు సినిమాలను డబ్బింగ్ తో ఓటీటీలు ద్వారా ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. దీంతో ఫహద్ నటించే కొత్త సినిమాలను కూడా టాలీవుడ్ లో రిలీజ్ చేసేలా.. తెలుగు టచ్ ఉండేలా చూసుకుంటున్నారు. ఈక్రమంలోనే ఫహద్ నటించే కొత్త సినిమాని ఆంధ్రప్రదేశ్ ‘ప్రొద్దటూరు’లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఫహద్ తో పాటు మన తెలుగు నటుడు కృష్ణుడు కూడా నటిస్తున్నారు.
Also read : Chiranjeevi : ప్రభాస్ కాదని ఉంటే.. చిరంజీవితో సినిమా చేసేవాడిని.. మారుతీ కామెంట్స్..
ఈ సినిమాలోని ఓ హోటల్ సన్నివేశాన్ని ప్రొద్దుటూరు సెంటర్ లో చిత్రీకరిస్తుండగా కొంతమంది ఆడియన్స్.. ఆ షూటింగ్ ని వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హోటల్ లో భోజనం చేసిన ఫహద్ అండ్ టీం.. అక్కడి నుంచి ఓ ఆటో ఎక్కి బయలుదేరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వీడియో వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
కాగా ఫహద్ నటిస్తున్న పుష్ప 2 విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఫహద్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు. అల్లు అర్జున్, ఫాహిద్ మధ్య జరిగే పోరాటం ఓ రేంజ్ లో ఉంటుందని, ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా వైడ్ ఎదురు చూస్తున్న ఈ చిత్రం.. ఆగష్టు 15న రిలీజ్ అయ్యేందుకు డేట్ ని ఫిక్స్ చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ డేట్ కి రావడం కష్టమని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వాటిలో ఎంత నిజముందో తెలియాలంటే మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.