Vishwambhara: మెగా ఫ్యాన్స్ కి మెగా అలర్ట్.. శివరాత్రికి సిద్ధంగా ఉండండి.. విశ్వంభరుడు వచ్చేస్తున్నాడు!
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర(Vishwambhara) సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రానుంది.
Chiranjeevi Vishwambhara movie release date update on shivaratri.
- మెగా ఫ్యాన్స్ కి పండగలాంటి వార్త
- విశ్వంభర మూవీపై మెగా అప్డేట్
- శివరాత్రికి టీజర్ తో రిలీజ్ డేట్ ప్రకటన
Vishwambhara; మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించింది. సంక్రాంతి పండుగకు పండగలాంటి సినిమా రావడంతో థియేటర్స్ అన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ తో కళకళలాడాయి. చాలా ఏళ్ళ తరువాత హాలు నిండినది అనే బోర్డులు థియేటర్స్ ముందు కనిపించడం ఈ సినిమాకె జరిగింది.
అంతలా మన శంకర వరప్రసాద్ గారు సినిమాను ఆదరించారు ఆడియన్స్. దీంతో, ఈ సినిమాలో రూ.375 కోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్ నయా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. అదే విశ్వంభర(Vishwambhara). భారీ గ్రాఫికల్ కంటెంట్ తో పాన్ ఇండియా లెవల్లో రానుంది ఈ సినిమా. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బింబిసారు ఫేమ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నాడు.
Allu Arjun- Rashmika: పుష్ప కాంబో రిపీట్.. కానీ హీరోయిన్ గా కాదు.. ఆడియన్స్ కి షాక్ ఇవ్వనున్న రష్మిక
సోసియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక అప్పటినుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ కి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా 2025 సంక్రాంతికి రావాల్సింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది ఈ సినిమా. ఇక ఇప్పుడు విడుదలకు సిద్ధం అయ్యింది.
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు విశ్వంభర జులై 10న విడుదల అవుతుందని తెలుస్తోంది. దీనికి సంబందించిన అప్డేట్ ను శివరాత్రికి రానుందట. దాదాపు 30 సెకన్ల పాటు ఉండే చిన్న టీజర్ తో విశ్వంభర రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారట. దీంతో, మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని వాయిదాల మధ్య వస్తున్న విశ్వంభర సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.
