Chiranjeevi: తెలుగు భాషను పరిరక్షించుకుందాం – మెగాస్టార్ చిరంజీవి
తన చిత్రాలతో తెలుగు భాషని ప్రపంచ నలుమూలలకి తీసుకువెళ్లిన హీరో మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుగు వారికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Chiranjeevi Wishes Telugu People On Telugu Language Day
Chiranjeevi: తన చిత్రాలతో తెలుగు భాషని ప్రపంచ నలుమూలలకి తీసుకువెళ్లిన హీరో మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుగు వారికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మతో వుండే అనుబంధం లాంటిదే మనకు మాతృభాషతో వుండే సంబంధం. అలాంటి తెలుగు భాషని పరిరక్షించుకుందాం.. మన తెలుగు భాష తియ్యదనాన్ని అందరికీ పంచుదాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
అయితే ఆగష్టు 29న మనం తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. తెలుగును ప్రామాణిక భాషగా గుర్తించడానికి ఆయన కృషియే కారణమని.. రామమూర్తి తెలుగులోని లిఖిత మరియు మాట్లాడే భాషల మధ్య వ్యత్యాసాలను తొలగించారని.. ఇది చదివేవారికి దానిని బాగా అర్ధంచేసుకోడానికి సాయపడిందని చిరు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అటు తెలుగు భాషా దినోత్సవాని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీంతో పాటు బోధన, సాహిత్యం లేదా విద్య వంటి బహుళ వేదికలపై భాషా అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. అలాగే రామమూర్తి లాంటి 40 మందిని గుర్తించి ప్రశంసా పత్రంతో పాటు ఒక్కొక్కరికి రూ.15,000 నగదు బహుమతిని అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరు చేసిన ట్వీట్‌ను తెలుగు ప్రేక్షకులు తెగ షేర్ చేస్తున్నారు.
తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు!
అమ్మతో వుండే అనుబంధం లాంటిదే మనకు మాతృభాషతో వుండే సంబంధం! అలాంటి తెలుగు భాషని పరిరక్షించుకుందాం! మన తెలుగు భాష తియ్యదనాన్ని అందరికీ పంచుదాం! ?
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 29, 2022