Nagababu: చిరంజీవి ఆశీస్సులు ప్రకాష్ రాజ్ కి ఉన్నాయి – నాగబాబు

Nagababu
Nagababu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తోపాటు, మంచు విష్ణు, జీవితరాజశేఖర్, నటి హేమ బరిలోకి దిగుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి నటుడు నాగబాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా నాగబాబు మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ రెండు నెలల క్రితం తనను కలిసి “మా” అభివృద్ధి గురించి చెప్పారని అన్నారు. అప్పుడే ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి “మా” ఉండాలని అనుకున్నానని తెలిపారు. ఇక్క లోకల్, నాన్ లోకల్ అనే దానికి ఆస్కారం లేదని, మా లో సభ్యత్వం ఉన్న ఉంటే ఎవరైన పోటీ చేయొచ్చని తెలిపారు.
ప్రకాష్ రాజ్ మంచి నటుడని తనని మేము సపోర్ట్ చేస్తామని నాగబాబు వివరించారు. చిరంజీవి ఆశీస్సులు కూడా ఉంటాయని వివరించారు. నాలుగేళ్లుగా మా ప్రతిష్ఠి మసకబారిందని నాగబాబు అన్నారు. మళ్లీ “మా”కు పునర్వైభవం రావాలంటే ప్రకాష్ రాజ్ కావాలని తెలిపారు.