Chiranjeevi : మెగా అభిమానులకు శుభవార్త.. త్వరలోనే ‘ఇంద్ర’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్స్..
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో ఇంద్ర, జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా ఉన్నాయి.

Indra and Jagadeka Veerudu Athiloka Sundari sequel announced by Aswani dutt
Chiranjeevi – Aswani Dutt : మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో ‘ఇంద్ర’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కూడా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలను వైజయంతీ బ్యానర్‌లో అశ్వినీదత్ నిర్మించారు. ఇక ఈ చిత్రాలకు సీక్వెల్స్‌ను తెరకెక్కించాలని ఎన్నో రోజులుగా అభిమానులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు దీనిపై నిర్మాత అశ్వినీ దత్ స్పందించారు. ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్తను చెప్పారు.
చిరు 69వ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న ఇంద్ర మూవీని రిరీలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రి రీలీజ్‌లోనూ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంద్ర మూవీ యూనిట్‌ను తన ఇంటికి పిలిపించుకున్నారు. ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రొడ్యూసర్ అశ్వినీ దత్, దర్శకుడు బి.గోపాల్, రచయితలు పరుచూరి బ్రదర్స్, సంగీత దర్శకుడు మణిశర్మ, రైటర్ చిన్ని కృష్ణ లు చిరు ఇంటికి వచ్చారు.
Devara : ‘దేవర’ బుకింగ్స్ ఓపెన్..! బెనిఫిట్ షోస్ టైం ఫిక్స్..?
వీరందరికి శాలువా కప్పి సన్మానించారు చిరు. అంతేకాదండోయ్ నిర్మాత అశ్వినీదత్‌కు పాంచజన్యాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. అనంతరం ఇంద్ర చిత్రానికి సంబంధించిన స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను “ఇంద్ర భవనంలో సత్కారం” పేరిట వైజయంతీ మూవీస్ వీడియోను విడుదల చేసింది. చిరు రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదని నిర్మాత అశ్వినీదత్ అన్నారు.
‘ఇంద్ర’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలకు సీక్వెల్స్ తీస్తానని ఆయన వీడియో చివర్లో చెప్పారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ రెండు సీక్వెల్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారని, త్వరలోనే ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని వెల్లడించారు.