Chiyaan Vikram SJ Suryah Veera Dheera Soora Movie Review and Rating
Veera Dheera Soora Movie Review : తమిళ్ స్టార్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘వీర ధీర శూర పార్ట్ 2’. ఈ సినిమా నేడు మార్చి 27న తమిళ్, హిందీ, తెలుగులో రిలీజ్ అయింది. H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మాణంలో ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్, 30 ఇయర్స్ పృథ్వీ.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.
కథ విషయానికొస్తే.. పెద్దాయన అలియాస్ రవి(30 ఇయర్స్ పృథ్వీ) అతని కొడుకు కన్న(సూరజ్ వెంజరాముడు) ఇంటికి రాత్రి పూట ఓ మహిళ వెళ్లి తన భర్తని మీరే ఏదో చేసారని గొడవపడుతుంది. కాసేపటికి ఆమె భర్త పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భార్య, కూతురు కనిపించట్లేదు, చివరగా రవి ఇంటికి వెళ్ళింది అని కంప్లైంట్ ఇస్తాడు. SP అరుణగిరి(SJ సూర్య) రవిని, కన్నని చంపాలని ఎప్పట్నుంచో చూస్తాడు. అదే రోజు ఆ ఊళ్ళో జాతర కూడా జరుగుతుంది. ఇదే మంచి టైం, ఆ మహిళని చంపేశారని కన్నని ఎన్ కౌంటర్ చేసేయొచ్చు అని రాత్రిలోపు చంపేయాలని అన్ని పర్మిషన్స్ తో ప్లాన్ చేస్తాడు.
ఇది తెలిసిన రవి గతంలో తన దగ్గర సొంత మనిషిలా ఉన్న కాళీ(విక్రమ్) దగ్గరికి వెళ్లి తన కొడుకుని కాపాడమని బతిమాలుతాడు. పాత జీవితం అన్ని వదిలేసి ఫ్యామిలీతో గడుపుతున్న కాళీ మొదట నో చెప్పినా తర్వాత ఒప్పుకుంటాడు. మరి కాళీ కన్నని కాపాడాడా? SP కన్నని చంపాడా? అసలు కాళీ ఎవరు? అతని గతం ఏంటి? SP కి, రవి-కన్నలకు ఉన్న గొడవలు ఏంటి? ఆ మహిళ ఏమైంది? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Priyanka Chopra : రాజమౌళి – మహేష్ సినిమాలో ప్రియాంక క్యారెక్టర్ ఇదే.. మళ్ళీ హైదరాబాద్ కు ప్రియాంక చోప్రా..
సినిమా విశ్లేషణ.. వీర ధీర శూర పార్ట్ 2 అని పెట్టి ఆ తర్వాత పార్ట్ 1 తీస్తాం అని సినిమాపై మొదట్లోనే ఆసక్తి నెలకొల్పారు. ఈ సినిమా కథ అంత ఒక్క రాత్రిలో జరుగుతుంది. ఈ సినిమాని చూస్తే కార్తీ ఖైదీ సినిమా పోలికలు ఉన్నా కథాంశంలో చాలా తేడా ఉంది. గతంలో ఓ పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్న హీరో, ప్రస్తుతం అన్ని వదిలేసి సింపుల్ గా ఫ్యామిలీతో బతకడం, ఏదో ఒక పరిస్థితి వల్ల మళ్ళీ మారడం అనేక సినిమాల్లో చూసాం. ఇది కూడా అంతే.
ఫస్ట్ హాఫ్ రవి వాళ్ళింటి వద్ద మహిళ గొడవ పడి వెళ్ళాక కనపడట్లేదని ఆమె భర్త కంప్లైంట్ ఇవ్వడంతో కథ మొదలవుతుంది. SP వాళ్ళని చంపడానికి ప్లాన్ చేయడం, రవి కాళీ దగ్గరికి రావడం, కాళీ గురించి ఎలివేషన్స్ ఇస్తారు. అయితే ప్రీ ఇంటర్వెల్ కి మంచి బ్యాంగ్ ఉన్నా అక్కడ ఇవ్వకుండా సింపుల్ గా ఇంటర్వెల్ ఇవ్వడం గమనార్హం. ఇక కాళీ ఒక్క సంఘటన అంటూ ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తారు. తీరా ఫ్లాష్ బ్యాక్ లో ఆ ఒక్క సంఘటన సింపుల్ గా ఇంతేనా అనిపిస్తుంది. హీరో పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ కి తగ్గట్టు ఫ్లాష్ బ్యాక్ లేకపోవడం పెద్ద మైనస్. ఫ్లాష్ బ్యాక్, అందరూ తన ఫ్యామిలీని చంపేస్తామని బెదించడంతో హీరో ఏం చేసాడు? ఎవరు ఎవర్ని చంపారు అని సెకండ్ హాఫ్ కాస్త ఆసక్తిగానే సాగుతుంది. ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్ప సెకండ్ హాఫ్ క్యాట్ – మౌస్ రేస్ లాగా థ్రిల్లింగ్ గా నడుస్తుంది.
సినిమా అంతా అయ్యాక ఇచ్చిన చిన్న ట్విస్ట్ అదిరిపోతుంది. కథ రెగ్యులర్ ఫార్మేట్ లో ఉన్నా అక్కడక్కడా కాస్త బోర్ కొట్టించినా థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో బాగానే రాసుకున్నారు. థ్రిల్లింగ్ యాక్షన్ సినిమాలు నచ్చేవారికి ఇది బాగానే నచ్చుతుంది. పార్ట్ 2 అని తీసిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మరి ఫ్యూచర్ లో పార్ట్ 1 తీస్తారో లేదో చూడాలి. ఒకవేళ వీర ధీర శూర పార్ట్ 1 తీస్తే అందులో అనాథ కాళీగా ఎలా మారాడు అని చూపిస్తారు. ఖైదీలాగే ఒక్కరాత్రిలో విధ్వంసం చూపించాలని ప్రయత్నిచారు కానీ ఆ రేంజ్ లో కాకపోయినా థ్రిల్లింగ్ ఫీల్ అయితే ఇచ్చారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. విక్రమ్ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. పాత్ర ఎలాంటిదైనా ప్రాణం పెట్టి ఎంతటి కష్టం అయినా పడి చేస్తాడు విక్రమ్. ఈ సినిమాలో కూడా తన నటనతో అదరగొట్టాడు. విక్రమ్ భార్య పాత్రలో దుషార విజయన్ క్యూట్ గా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్ లో మెప్పిస్తుంది. SJ సూర్య ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంటాడు. సూరజ్ వెంజరాముడు కాస్త నెగిటివ్ షేడ్స్ లో మెప్పిస్తాడు.
ఈ సినిమాలో మన 30 ఇయర్స్ పృథ్వీ పాత్రని ఎవ్వరూ ఊహించలేరు. ఇన్నాళ్లు కామెడీ పండించిన పృథ్వీ ఈ సినిమాలో ఎమోషన్ తో అదరగొట్టేసాడు. పృథ్వీ ఇలాంటి పాత్రలను ఇంతబాగా పండిస్తాడా అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత పృథ్వీకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
Also Read : Pawan Kalyan : పవన్ ఫ్లాప్ సినిమా రీ రిలీజ్ పై.. నిర్మాత ఏమన్నారంటే..?
సాంకేతిక అంశాలు.. సినిమా అంతా ఒక్క రాత్రిలో జరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్ఫెక్ట్ గా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా ఇచ్చారు. పాటలు మాత్రం యావరేజ్. కాస్త కొత్త కథ, కథనంతో అక్కడక్కడా బోర్ కొట్టించి, సింపుల్ ఫ్లాష్ బ్యాక్ అనిపించినా బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా సినిమా తక్కువ బడ్జెట్ లోనే అయిపోయింది అనిపిస్తుంది.
మొత్తంగా ‘వీర ధీర శూర పార్ట్ 2’ సినిమా ఒక్క రాత్రిలో ఎవరు ఎవర్ని చంపుతారు అని సాగే థ్రిల్లింగ్ సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.