Priyanka Chopra : రాజమౌళి – మహేష్ సినిమాలో ప్రియాంక క్యారెక్టర్ ఇదే.. మళ్ళీ హైదరాబాద్ కు ప్రియాంక చోప్రా..

అభిమానులకు పూనకాలు తెప్పించే ట్విస్ట్ ఒకటి ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

Priyanka Chopra : రాజమౌళి – మహేష్ సినిమాలో ప్రియాంక క్యారెక్టర్ ఇదే.. మళ్ళీ హైదరాబాద్ కు ప్రియాంక చోప్రా..

Priyanka Chopra Character in Mahesh Babu Rajamouli Movie Rumors goes Viral

Updated On : March 27, 2025 / 5:54 PM IST

Priyanka Chopra : కట్టప్ప పాత్ర.. బాహుబలిని ఏ రేంజ్‌లో నిలబెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అంటూ.. దేశమంతా సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూసింది. అలాంటి కట్టప్పనే ఇప్పుడు మహేష్‌ మూవీలోనూ పెడుతున్నాడట జక్కన్న. కాకపోతే ఈసారి ఇంకాస్త స్పెషల్.

సూపర్‌స్టార్ మహేష్‌, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 మూవీపై అంచనాలు ఇప్పటికే ఆకాశం దాటిపోయాయ్‌. మహేష్ కెరీర్‌లోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో మరో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా నిలబోతుందన్న ప్రకటనలు అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా చేస్తోంది. ఒక్క అప్డేట్ ఒకే ఒక్క అధికారిక అప్డేట్ ప్లీజ్ అని ఎదురుచూస్తున్న అభిమానులకు పూనకాలు తెప్పించే ట్విస్ట్ ఒకటి ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

Also Read : Pawan Kalyan : పవన్ ఫ్లాప్ సినిమా రీ రిలీజ్ పై.. నిర్మాత ఏమన్నారంటే..?

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హైదరాబాద్‌ చేరుకోవడంతో రకరకాల కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయ్. ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో హలో హైదరాబాద్ అంటూ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం బల్క్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. రాజమౌళి కథలో ఆమెకు ఓ కీలకమైన పాత్రను రాసినట్లు తెలుస్తోంది.

SSMB29లో ప్రియాంకది హీరోయిన్ పాత్ర కాదని, నెగిటివ్‌ షేడ్స్ ఉన్న కేరక్టర్ అనే గాసిప్‌ ఫిల్మ్‌నగర్ జంక్షన్‌లో రీసౌండ్ ఇస్తోంది. హీరోను నమ్మించి చీట్ చేసే క్యారెక్టర్ అని, బాహుబలిలో ప్రభాస్‌కు నమ్మిన బంటుల ఉండే కట్టప్ప చివరలో వెన్నుపోటు పొడిచినట్లే.. ఇందులో మహేశ్‌తో లవ్ ట్రాక్ నడిపి ఆఖరికి ప్రియాంక పాత్ర వెన్నుపోటు పొడుస్తుందని తెలుస్తోంది.

Also Read : Vishwak Sen : నాగ్ అశ్విన్ బయోపిక్ చేస్తున్న విశ్వక్ సేన్..? నిర్మాత వ్యాఖ్యలు వైరల్..

ప్రియాంక చోప్రా కెరీర్‌లో ఇది డిఫరెంట్‌ పాత్ర అని, కెరీర్‌ మొత్తం గుర్తుండిపోతుందని చెప్తున్నారు. ప్రియాంక పాత్ర సినిమాను మలుపు తిప్పుతుందట. మరి కట్టప్ప మెత్తగా కత్తి దింపితే లేడీ కట్టప్ప ఏం చేస్తుందో చూడాలంటూ ఫ్యాన్స్‌ తెగ వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మూవీ టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోయినా అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో అంటూ ఈ న్యూస్‌ను వైరల్‌గా మార్చేశారు ఫ్యాన్స్‌.

మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిగితే, ఒడిశాలో మరో భారీ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. ఇన్‌డోర్‌లో జక్కన్న భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు. ఈ షెడ్యూల్‌లో మహేష్‌తో పాటు ప్రియాంక కలవబోతోంది. అందుకే హైదరాబాద్‌ వచ్చింది ప్రియాంక.