Pawan Kalyan : పవన్ ఫ్లాప్ సినిమా రీ రిలీజ్ పై.. నిర్మాత ఏమన్నారంటే..?
సినిమాలు అప్పట్లో ఫ్లాప్ అయినా ఇప్పుడు రీ రిలీజ్ అయి మంచి రీచ్ తెచ్చుకున్నాయి.

Producer Naga Vamsi Comments on Pawan Kalyan Flop Movie Agnyaathavaasi
Pawan Kalyan : ఇటీవల అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అయి మళ్ళీ హిట్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఫ్లాప్ సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యాయి. ప్రభాస్, చరణ్, మహేష్.. ఇంకొంతమంది సినిమాలు అప్పట్లో ఫ్లాప్ అయినా ఇప్పుడు రీ రిలీజ్ అయి మంచి రీచ్ తెచ్చుకున్నాయి.
తాజాగా పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫ్లాప్ సినిమా అయిన అజ్ఞాత వాసి రీ రిలీజ్ పై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా అజ్ఞాతవాసి రిలీజ్ అయింది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటించారు. పవన్ పాలిటిక్స్ లోకి పూర్తిగా ఎంటర్ అయ్యేముందు చివరి సినిమా అంటూ ప్రమోట్ చేసారు. తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. త్రివిక్రమ్ – పవన్ మూడో సినిమా.
Also Read : Vishwak Sen : నాగ్ అశ్విన్ బయోపిక్ చేస్తున్న విశ్వక్ సేన్..? నిర్మాత వ్యాఖ్యలు వైరల్..
ఇలా అన్ని రకాలుగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ రిలీజయ్యాక భారీ ఫ్లాప్ అయింది ఈ సినిమా. పవన్ ఫ్యాన్స్ సైతం బాలేదు అంటూ విమర్శలు చేసారు. పవన్ కెరీర్లో జానీ తర్వాత ఆ రేంజ్ ఫ్లాప్ మళ్ళీ అజ్ఞాతవాసినే. ఈ సినిమా వల్ల నిర్మాణ సంస్థకి భారీ నష్టం వచ్చిందని నిర్మాత నాగవంశీ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు కూడా.
తాజాగా మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఫ్లాప్ సినిమాలు కూడా క్లాసిక్ అని రీ రిలీజ్ చేసి సక్సెస్ చేస్తున్నారు అని ప్రశ్నించగా.. అవన్నీ సాంగ్స్ వల్లే. సాంగ్స్ రీ కాల్ అవుతుండటం, పాటల వల్లే రీ రిలీజ్ లు వర్క్ అవుట్ అవుతున్నాయి అని అన్నారు నాగవంశీ. మరి అజ్ఞాతవాసి కూడా రీ రిలీజ్ చేసి ఈసారి హిట్ చేయొచ్చు కదా అని అడగ్గా.. వద్దులెండి కొన్ని కొన్ని టచ్ చేయకూడదు అని అన్నారు నిర్మాత నాగవంశీ. దీంతో నాగవంశీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also See : Youtuber Mahathalli : ఫ్రెండ్స్, భర్తతో కలిసి యూట్యూబర్ మహాతల్లి బేబీ బంప్ ఫొటోలు..
అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయినా పాటలు మాత్రం హిట్ అయ్యాయి. కానీ ఆ సినిమా నిర్మాణ సంస్థకి బాగా ఎఫెక్ట్ అయింది. అందుకే నిర్మాత రీ రిలీజ్ వద్దులెండి అంటూ ఆసక్తి చూపించలేదు. మరి ఫ్లాప్ సినిమాలు కూడా రీ రిలీజ్ చేస్తున్న ఈ సమయంలో పవన్ ఫ్యాన్స్ ఎవరైనా అజ్ఞాతవాసిని రీ రిలీజ్ చేస్తారేమో చూడాలి.