సిద్ శ్రీరామ్ బ్యూటిఫుల్ మెలోడి.. ‘నీ పరిచయముతో’

పెళ్ళి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్న సినిమా చూసీ చూడంగానే. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, మాళవికా సతీష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలతో అబ్బాయి నడిపే ప్రేమ నేపథ్యంలో మూవీ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా టీజర్ విడుదల కాగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘నీ పరిచయముతో’ అంటూ మెలోడి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు గోపి సుందర్ ట్యూన్ కంపోజ్ చేయగా.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశారు. సిద్ శ్రీరామ్ పాడారు.
రాజ్ కందుకూరి గత చిత్రాల్లానే ఈ సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్ అసోషియేషన్‌లో రిలీజవనుంది. తమిళనాట ‘96’, ‘బిగిల్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ టాలీవుడ్‌కి పరిచయం అవుతుంది. పవిత్ర లోకేష్, రాజేష్ ఖన్నా, వెంకటేష్ కాకుమాను, అనీష్, గురు రాజ్ ఇతర పాత్రలలో నటించారు.