Site icon 10TV Telugu

Sekhar Master : ఆ విషయంలో నేను చాలా సఫర్ అయ్యా.. మాకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి..

Choreographer Shekar Master Gives Clarity on Janu Lyri Issue

Image Credits : Nikhil Vijayendra Simha Youtube

Sekhar Master : శేఖర్ మాస్టర్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్. ఓ పక్క సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా, మరో పక్క టీవీ షోలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు శేఖర్ మాస్టర్. ఈ ఇంటర్వ్యూలో ఓ వివాదంపై క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల ఢీ డ్యాన్స్ షోలో జాను లిరి అనే అమ్మాయి పాల్గొనడం, ఆ అమ్మాయిని శేఖర్ మాస్టర్ రెగ్యులర్ గా బాగా పొగడటం, ఆ అమ్మాయే ఆ షోలో విన్ అవ్వడంతో సోషల్ మీడియాలో జాను లిరి, శేఖర్ మాస్టర్ పై విమర్శలు వచ్చాయి. కావాలని ఆ అమ్మాయిని గెలిపించారని, జాను లిరి కంటే బాగా చేసిన వాళ్ళు ఉన్నారని, ఆ అమ్మాయికి శేఖర్ మాస్టర్ కి మధ్యే ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసారు.

Also Read : Yamudu : ‘యముడు’ కొత్త పోస్టర్ చూశారా..? మరో మైథాలజీ టచ్ ఉన్న సినిమా..

శేఖర్ మాస్టర్ దీనిపై స్పందిస్తూ.. ఆ అమ్మాయి బాగా చేసింది అందుకే మెచ్చుకున్నాను. బాగా చేసిన అబ్బాయిలను కూడా మెచ్చుకున్నాను. ట్యాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేయడం, అభినందించడం తప్పా. ఆమె చేసిన సీజన్ సెలబ్రిటీల సీజన్. అందులో అందరికంటే ఆమె బాగా చేసింది. అందుకే ఆమె గెలిచింది. నేనేదో కావాలని గెలిపించారని కామెంట్స్ చేస్తున్నారు. నా సోషల్ మీడియా పోస్టుల కింద ఆమె పేరుతో కామెంట్స్ చేస్తారు. ఆ విషయంలో నేను చాలా సఫర్ అయ్యాను. నాకు ఆమెకి రిలేషన్ ఉందని, ఇంకా ఏదేదో అంటూ కామెంట్స్ చేసారు. ఆమెకు ఫ్యామిలీ ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది. వాళ్ళు బాధపడతారు. అలా కామెంట్స్ చేస్తే వాళ్లకు ఏమొస్తుంది అని అన్నారు. దీంతో శేఖర్ మాస్టర్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read : NC24: నాగచైతన్య, కార్తిక్ దండు కాంబోలో NC24.. అంచనాలు పెంచేసిన స్పెషల్ వీడియో.. మీరు చూశారా..

Exit mobile version