Actor Vivek Mashru
Actor Vivek Mashru : చాలామంది పాపులర్ టెలివిజన్ సిరీస్ సిఐడి చూసి ఉంటారు. అందులో ఇన్‌స్పెక్టర్ వివేక్ పాత్రలో నటించిన నటుడు వివేక్ మశ్రూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కారణం ఏంటంటే.. ఒకప్పుడు ఆయన నటుడు కానీ ప్రస్తుతం ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్ అట. అదీ విషయం.
Suman : నటుడు సుమన్‌పై డైరెక్టర్ శివనాగు ఫైర్.. ఈవెంట్‌కి రమ్మంటే 2 లక్షలు అడిగాడు..
@Samosaholic అనే ట్విట్టర్ యూజర్ వివేక్ మష్రూ ఫోటోను షేర్ చేస్తూ ‘ మీకు ఆయన తెలిస్తే.. మీ బాల్యం అద్భుతంగా ఉన్నట్లు’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి మశ్రూ ‘నేను చేసిన చిన్న పాత్రకి మీరు నాపై ప్రేమ, దయ, ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్‌ను ఫాలో అవుతూ ఒక మహిళ మశ్రూ ఓ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మశ్రూ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, బెంగళూరులోని CMR యూనివర్సిటీలో కామన్ కోర్ కరికులం విభాగానికి మష్రూ డైరెక్టర్‌గా ఉన్నారు. మశ్రూ ఇలా వార్తల్లో నిలిచారు.
Adipurush : ఆదిపురుష్ టీంని నిలబెట్టి కాల్చేయాలి.. శక్తిమాన్ నటుడు ముకేష్ ఖన్నా..
‘మశ్రూ ఇంకా ఫోరెన్సిక్ నేర్పిస్తారని నేను అనుకున్నాను’ అని ఒకరు.. ‘మీకు థ్యాంక్స్ చెప్పాలి.. మా చిన్నతనాన్ని గుర్తుండిపోయేలా చేశారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. చాలామంది నటులు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అని చెబుతుంటారు.. వివేక్ మిశ్రూ మాత్రం యాక్టర్ అయ్యి ప్రొఫెసర్ కూడా అయ్యారన్నమాట
Thank you so much for your kindness, love, and appreciation for whatever little I have done. It means a lot to me and it is deeply appreciated! Infinite gratitude and love, always.????☀️⭐️? https://t.co/TjD0UJVR9B
— Viivek Mashru (@VIIVEKMASHRU) June 21, 2023