CM Jagan : కృష్ణ పార్థివదేహానికి నివాళు అర్పించిన సీఎం జగన్..

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కృష్ణ మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రెండు నెలలు క్రిందటే కృష్ణ భార్య ఇందిరా దేవి కూడా మరణించడం, ఇప్పుడు ఇలా జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇక అయన పార్థివదేహానికి కడసారి నివాళు అర్పించేందుకు సినీ రాజకీయ ప్రముఖులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి..

CM Jagan Pay last rescept to Super Star Krishna

CM Jagan : టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కృష్ణ మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రెండు నెలలు క్రిందటే కృష్ణ భార్య ఇందిరా దేవి కూడా మరణించడం, ఇప్పుడు ఇలా జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇక అయన పార్థివదేహానికి కడసారి నివాళు అర్పించేందుకు సినీ రాజకీయ ప్రముఖులు తరలి వస్తున్నారు.

Superstar Krishna Passed Away : నేడు తెలుగు సినీ పరిశ్రమ బంద్.. నిర్మాత మండలి!

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కృష్ణకి నివాళు అర్పించేందుకు పద్మాలయ స్టూడియోస్ కి చేరుకున్నారు. కృష్ణకి చివరిసారిగా నివాళు అర్పించిన సీఎం జగన్.. కుటుంబసభ్యులతో మాట్లాడి వాళ్లకి దైర్యం చెబుతూ ఓదార్చడానికి ప్రయత్నం చేశారు. సూపర్ స్టార్ కృష్ణకి స్వర్గీయ వైస్ రాజశేఖర్ రెడ్డితో యెనలేని అనుబంధం ఉంది. రాజకీయ పరంగా కృష్ణ, వైస్ తో కలిసి నడిచిన సంగతి తెలిసిందే.

ఇక జగన్ రాక వల్ల అభిమానులను క్యూ లైన్ లో నిలిపి వేశారు. అయన వెళ్ళాక మళ్ళీ అభిమానులను కృష్ణ చివర చూపు కోసం వీలు కలిపిస్తున్నారు. అయితే మరికొద్ది క్షణాల్లో కృష్ణ అంతిమయాత్ర మొదలు కానుంది. పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబిలీహిల్స్ మహాప్రస్థానికి అంతిమయాత్రగా కృష్ణ భౌతికాయాన్ని తీసుకువెళ్లనున్నారు. సుమారు 3 గంటలు సమయంలో కృష్ణ అంత్యక్రియలు అధికార లాంఛనాలు మధ్య నిర్వహించనున్నారు.