CM KCR : అల్లు అర్జున్‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపిన సీఎం కేసీఆర్‌

జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun) కు సీఎం కేసీఆర్ శుభాభినంద‌న‌లు తెలియ‌జేశారు. 69ఏళ్ల సినీ చ‌రిత్ర‌లో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు.

CM KCR : అల్లు అర్జున్‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపిన సీఎం కేసీఆర్‌

CM KCR-Allu Arjun

Updated On : August 26, 2023 / 6:09 PM IST

CM KCR Appreciates : ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేశీయ చలన చిత్రాలకు ప్రతీయేటా కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తోంది. అందులో భాగంగా ఇటీవ‌ల 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల‌ను (69th National Film Awards) కేంద్రం ప్ర‌క‌టించింది. ఈ అవార్డుల్లో తెలుగు చిత్రాలు స‌త్తా చాటాయి. ప‌లు విభాగాల్లో తెలుగు సినిమాలు అవార్డుల‌ను సొంతం చేసుకోవ‌డం ప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్ (CM KCR) హ‌ర్షం వ్యక్తం చేశారు.

జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun) కు కేసీఆర్ శుభాభినంద‌న‌లు తెలియ‌జేశారు. 69ఏళ్ల సినీ చ‌రిత్ర‌లో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లు చేస్తూ తెలుగు ఆడియన్స్‌తో పాటు అంతర్జాతీయ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నార‌న్నారు. బ‌న్నీకి ఉత్త‌మ న‌టుడిగా అవార్డు రావ‌డం తెలుగు చ‌ల‌న చిత్ర రంగానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. నాటితరం గొప్ప నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా, విలక్షణ నటుడైన‌ చిరంజీవి వంటి వారి స్ఫూర్తితో నేటితరం నటుడిగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్ కృషి గొప్పదని సీఎం కేసీఆర్ కొనియాడారు.

Allu Arjun : పిలకేసిన అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసమా? ఈ వీడియోలు చూశారా?

త‌న‌ సృజనాత్మక రచనతో సినీ పాటల సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు, ఉత్తమ సినీ సాహిత్యానికి గాను జాతీయ అవార్డు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబోస్ కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఉత్తమ సంగీత దర్శకుడుగా దేవిశ్రీప్రసాద్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ కాళభైరవ, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులుతో పాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక సిబ్బందికి ఈ సంద‌ర్భంగా కేసీఆర్ అభినంద‌లు తెలిపారు.

Kushi fifth Single Osi Pellama : స‌మంత వ‌ల్ల ఎన్ని ఇబ్బందులు ప‌డ్డాడో చెబుతున్న విజ‌య్‌.. ఖుషి నుంచి ఐదో సాంగ్ వ‌చ్చేసింది

హైద్రాబాద్ కేంద్రంగా తెలుగు చలన చిత్ర రంగం నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతుండడం గొప్ప విషయమని సీఎం అన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షాదరణ పొందుతూ, ఫిల్మ్ ప్రొడక్షన్ లో తెలుగు సినిమా దేశానికి ఆదర్శంగా నిలవడం మనందరికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌మ‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలుగు సినిమా ఇతర భారతీయ సినిమా రంగాలతో పోటీపడుతుండడం పట్ల ముఖ్య‌మంత్రి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తెలుగు చిత్ర రంగాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి కొనసాగిస్తూనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. విభిన్న సంస్కృతుల మేళవింపుతో భవిష్యత్తులో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాలని ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

Thalaivar 170 : రజినీకాంత్, అమితాబ్ సినిమాలో శర్వానంద్.. సూపర్ ఛాన్స్ కొట్టేశాడుగా..