CM Revanth Reddy : అసెంబ్లీ మాటకు కట్టుబడి ఉంటాను.. బెనిఫిట్ షోలు ఇవ్వను.. టాలీవుడ్ మీటింగ్ లో సీఎం ఏం చెప్పారంటే..

మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పెద్దలకు చెప్పిన మాటలు ఇవే..

CM Revanth Reddy Points in Meeting with Tollywood

CM Revanth Reddy : సంధ్య థియేటర్ ఘటన అనంతరం నేడు సినీ పెద్దలు తెలంగాణ సీఎంతో మీటింగ్ అయ్యారు. ఈ మీటింగ్ లో పలువురు టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు, పలువురు సినీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున కూడా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మాత, FDC చైర్మన్ దిల్ రాజు ముందుండి ఈ మీటింగ్ నిర్వహణకు లీడ్ తీసుకున్నారు.

Also Read : Director Bobby – Mokshagna : మోక్షజ్ఞ గురించి డైరెక్టర్ బాబీ కామెంట్స్.. అసలు అలాంటి కుర్రాడు మనకి దొరికితే..

ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పెద్దలకు చెప్పిన మాటలు ఇవే..

– ముందుగా సంధ్య థియేటర్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసి ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందని సీఎం రేవంత్‌ తెలిపారు.
– అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను. ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు అని సీఎం రేవంత్ ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు.
– శాంతిభద్రతల విషయంలో రాజీ పడేదే లేదు. అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని అన్నారు.
– ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని చెప్పారు.
– అలాగే సినీ పరిశ్రమ తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి. డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి అని తెలిపారు

-సినిమా వాళ్లకు సామాజిక బాధ్యత ఉండాలి. హీరోలు బయట కూడా హీరోలుగానే మెలగాలి. హీరోలను ఆదర్శంగా తీసుకుంటారు అని అన్నారు.
-ఇక చివర్లో ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని, ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

 

Also Read : Tollywood CM Meeting : సీఎంతో టాలీవుడ్ చర్చించే అంశాలు ఇవేనా? డ్రగ్స్ ఇష్యూ నుంచి గద్దర్ అవార్డులు, బన్నీ ఇష్యూ వరకు..

టాలీవుడ్ పెద్దలతో సిఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఇంకా కొనసాగుతుంది. ఈ మీటింగ్ లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ దృశ్యాలు సినిమా పెద్దలకు స్క్రీన్ పై వేసి పోలీసులు చూపించారు. సీఎం చెప్పిన పాయింట్స్ కి టాలీవుడ్ పెద్దలు ఓకే చెప్పి ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు.