CM Revanth Reddy takes Shocking Decision on Tollywood
CM Revanth Reddy : సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు జరిగిన ఘటన గురించి మొత్తం వివరించారు. అనంతరం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తే తిట్టిన వారిపై విమర్శలు చేసారు. అలాగే అల్లు అర్జున్ కి ఏమైందని సినిమా వాళ్లంతా వెళ్లి పరామర్శించారు, ఆ కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదు అని సినిమా వాళ్లపై ఫైర్ అయ్యారు.
ఈ సంఘటనతో రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకొని టాలీవుడ్ కి షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని.. సినిమా తీసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు తీసుకోండి కానీ ప్రాణాలు తీస్తామంటే మాత్రం ఒప్పుకోను. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవు. నేను సీఎంగా ఉన్నంత కాలం వాటికి అనుమతి ఇవ్వను. సినిమా వాళ్ళు వ్యాపారం చేసుకోండి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోము అంటూ సీరియస్ గా చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో టాలీవుడ్ కి గట్టి దెబ్బె తగిలేలా ఉంది. సినీ నిర్మాతలు ఈ వ్యాఖ్యలకు షాక్ అవుతున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు తీసేవాళ్ళు రేట్లు పెంచకపోతే, బెనిఫిట్ షోలు లేకపోతే తీవ్రంగా నష్టపోక తప్పదు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ కామెంట్స్ తో హీరోల అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు. ఇకపై నైజాంలో రికార్డులు రావడం కష్టమే, బెనిఫిట్ షోలు కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందిస్తారా చూడాలి.