Comedian Ali: ఏపీ ప్రభుత్వంలో కమీడియన్ అలీకి కీలక పదవి..

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీకి ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. తెలుగు తెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన ఆలీ కెరియర్.. హీరోగా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, వ్యాఖ్యాతగా సినీ రంగానికి ఎన్నో సేవలు అందించాడు. ఇప్పుడు తాను ఇంతటి స్థాయికి ఎదగడానికి కారణమైన ప్రజలకు సేవ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆలీకి ఆ పార్టీలో...

Comedian Ali has a key position in the AP government

Comedian Ali: టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీకి ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. తెలుగు తెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన ఆలీ కెరియర్.. హీరోగా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, వ్యాఖ్యాతగా సినీ రంగానికి ఎన్నో సేవలు అందించాడు. ఇప్పుడు తాను ఇంతటి స్థాయికి ఎదగడానికి కారణమైన ప్రజలకు సేవ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

Ram Gopal Varma: వంగవీటి సినీ నిర్మాతతో RGV కొత్త సినిమా.. రెండు భాగాలుగా రాబోతున్నట్లు ప్రకటన!

2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సమయంలో వైయస్సార్ సిపి పార్టీ పగ్గాలు అందుకున్నాడు ఈ స్టార్ కమెడియన్. ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీకి ఎన్నో సేవలు అందించాడు. దీంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆలీకి ఆ పార్టీలో కీలక పదవిని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఆలిని చైర్మన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆలీ రెండేళ్లు కొనసాగునున్నట్లు వైసిపి గవర్నమెంట్ పేర్కొంది. త్వరలోనే ఆలీ ముఖ్యమంత్రి జగన్ ని కలిసి కృతజ్ఞతలు తెలపనున్నాడు. కాగా ఏపీ పాలిటిక్స్ హీటేక్కుతున్న సమయంలో ఆలీకి ఈ పదవి ఇవ్వడం చర్చకు దారి తీస్తుంది.