Comedian ALI: కరోనా కష్టకాలంలో అలీ.. ఆపన్న హస్తం
కరోనా మహమ్మారి వ్యాప్తికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరికీ ఆర్థిక నష్టం జరిగి ఉండొచ్చు. కానీ, పూట గడవకుండా సతమతమవుతోన్న వారు చాలా మందే ఉన్నారు.

Comedian Ali
Comedian ALI: కరోనా మహమ్మారి వ్యాప్తికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరికీ ఆర్థిక నష్టం జరిగి ఉండొచ్చు. కానీ, పూట గడవకుండా సతమతమవుతోన్న వారు చాలా మందే ఉన్నారు. సినీ పరిశ్రమలోనూ షూటింగ్ కు వెళ్తేనే రోజు గడుపుకునే వారు ప్రస్తుతం షూటింగ్స్ లేక రోజువారీ సరుకులు కొనుగోలు చేయలేనంత ఇబ్బందుల్లో ఉన్నారు.
అటువంటి వారికి చేయూతగా సోనూసూద్ లాంటి వ్యక్తులు నిలుస్తుంటే.. తన శక్తి మేర కమెడియన్, నటుడు అలీ కూడా ముందుకొచ్చారు. తెలుగు సినిమా ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్‌కు సంబంధించిన 130 మంది మహిళలకు తన భార్య జుబేదా చేతుల మీదుగా నిత్యావసర సరుకులు సాయంగా అందించారు.
మా కన్నా ముందే లొకేషన్‌లో ఉండే లేడీస్ సెట్‌లో అందరూ తినే ప్లేట్స్, కప్పులు శుభ్రం చేస్తుంటారు. లాక్‌డౌస్ వలన వారంతా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది. రూ. 2 లక్షలతో సాయం చేయాలని నిర్ణయించుకున్నా. అని అలీ వివరించారు.