×
Ad

Mahesh Babu : మహేష్ బాబు మామూలోడు కాదు.. శృతి హాసన్ దగ్గర అలీని భలే బుక్ చేసేసాడు..

తాజాగా కమెడియన్ అలీ మహేష్ బాబు అల్లరి ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు.(Mahesh Babu)

Mahesh Babu

Mahesh Babu : మహేష్ బాబు కామెడీ టైమింగ్ అదిరిపోతుందని అందరికి తెలిసిందే. సినిమాల్లోనే కాకుండా బయట కూడా మహేష్ సరదాగా ఉంటూ కామెడీ చేస్తాడు, పంచులు వేస్తాడు. సైలెంట్ గా కనిపిస్తూనే పంచులు వేసి నవ్విస్తాడు. తాజాగా కమెడియన్ అలీ మహేష్ బాబు అల్లరి ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు.(Mahesh Babu)

ఈటీవీ 30 ఏళ్ళ ఈవెంట్ శ్రీకాకుళంలో జరిగింది. తాజాగా ఈ ఈవెంట్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్లో యాంకర్ ప్రదీప్ కమెడియన్ అలీని మీకు పరిచయం ఉన్న అందరి హీరోల్లో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు అని అడిగాడు.

Also Read : Nagarjuna : అక్కినేని అఖిల్ తండ్రి కాబోతున్నాడా? స్పందించిన నాగార్జున..

దీనికి అలీ సమాధానమిస్తూ.. మహేష్ బాబు బాగా అల్లరి చేస్తాడు. శ్రీమంతుడు షూటింగ్ సమయంలో ఓ సారి శృతి హాసన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఏంటి ఈ అమ్మాయి ఇంకా రాలేదు అన్నారు మహేష్. నేను సరదాగా వచ్చేస్తుంది లెండి కమల్ హాసన్ కూతురు కదా అన్నాను. ఆ అమ్మాయి సెట్ కి వచ్చిన తర్వాత మహేష్ ఆమె దగ్గరకు వెళ్లి ఇదిగో శృతి అలీ ఏమంటున్నాడో తెలుసా కమల్ హాసన్ కూతురు కదా లేట్ గా వస్తుంది అంటున్నాడు అంటూ ఆమెకు చెప్పి ఇరికించాడు అని తెలిపారు.

Also Read : Nagarjuna : 15 ఏళ్ళ నుంచి ఆ సమస్యతో బాధపడుతున్న నాగార్జున.. సర్జరీ వద్దంటూ..