Comedian Siva Reddy: ప్రముఖ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి 10టీవీ ఇంటర్వ్యూలో (స్టార్ షో) పాల్గొన్నారు. పలు అంశాలపై ఆయన స్పందించారు. సినిమాల్లోకి ఎలా వచ్చారు, అవకాశాలు ఎలా దక్కాయి, ప్రస్తుతం సినిమాలకు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అన్న ప్రశ్నలకు శివారెడ్డి సమాధానం ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతోంది? ఎలా ప్లాన్ చేశారు? అన్న ప్రశ్నకు ఆయన ఏం చెప్పారంటే..
”ఆంధ్ర కింగ్ తాలూకా తర్వాత వెంటనే ధనం మూలం అని వస్తోంది. ఆంధ్ర కింగ్ లో నా క్యారెక్టర్ మొత్తం ఉపేంద్రతో ఉంటుంది. ధనం మూలం సినిమాలో జేడీ చక్రవర్తి వెంట ఉంటాను. జేడీ చక్రవర్తి ఎస్ఐ, నేను హెడ్ కానిస్టేబుల్. మూవీ అంతా ఉంటాను. చాలా బాగుంటుంది. సింగరేణి కార్మికుల జీవితంపై సినిమా వస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. అందులో నాది ఫుల్ లెంత్ క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. డైరెక్టర్ చెబుతున్నప్పుడే నా రోల్ చాలా బాగుంది సర్.. నేను చేస్తున్నాను అని చెప్పేశాను.
ఆ క్యారెక్టర్ నేను చేసుంటే బాగుండేది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా?
”ఏ కళాకారుడికైనా ఏ మంచి క్యారెక్టర్ చూసినా.. అరె.. ఆ పాత్ర నేను చేసుంటే బాగుండేది అనిపిస్తుంటుంది. అది సహజం. ప్రేక్షకులు.. చాలా ఏళ్లుగా నా నటనను, నా మిమిక్రీని ఆదరించారు. నన్ను ఆదరించారు. అదే విధంగా మీ ఆదరణ, అభిమానం నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. స్నేహితులతో ఆప్యాయంగా ఉండండి. చుట్టుపక్కల పరిసరాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ లైఫ్ లో ముందుకు సాగండి. మీ దీవెనలు, అభిమానం నాపై నా కుటుంబసభ్యులపై, మా కళాకారులపై నిండుగా ఉండాలని కోరుకుంటున్నా” అని శివారెడ్డి అన్నారు.
”కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుకి నేనంటే చాలా ఇష్టం. నా మిమిక్రీని బాగా లైక్ చేస్తారు. ఆయన తన ఇంటికి చాలాసార్లు పిలిచారు. అందరికీ నన్ను పరిచయం చేశారు. నా వాయిస్ మిమిక్రీ బాగా చేస్తాడని అందరితో చెప్పేవారు. బయట ఫంక్షన్స్ లో ఎక్కడ కనిపించినా.. శివారెడ్డి నాకు తెలుసు అని చెబుతారు” అని శివారెడ్డి వెల్లడించారు.
Also Read: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల.. హిస్టరీ క్రియేట్ చేసిన కామనర్.. ఫ్యాన్స్ సంబరాలు