బ్రహ్మానందానికి గుండె నొప్పి : ముంబైలో సర్జరీ

హాస్య నటుడు బ్రహ్మానందానికి బైపాస్ సర్జరీ జరిగింది. సంక్రాంతి పండుగ రోజు అనారోగ్యంగా ఉండటంతో ఆయన్ను ఏషియన్ ఆస్పత్రిలో చేర్పించారు.

  • Published By: veegamteam ,Published On : January 16, 2019 / 04:05 AM IST
బ్రహ్మానందానికి గుండె నొప్పి : ముంబైలో సర్జరీ

Updated On : January 16, 2019 / 4:05 AM IST

హాస్య నటుడు బ్రహ్మానందానికి బైపాస్ సర్జరీ జరిగింది. సంక్రాంతి పండుగ రోజు అనారోగ్యంగా ఉండటంతో ఆయన్ను ఏషియన్ ఆస్పత్రిలో చేర్పించారు.

ముంబై : టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండె నొప్పి వచ్చింది. వైద్యులు వెంటనే బైపాస్ సర్జరీ చేశారు. 2019, జనవరి 15వ తేదీ మంగళవారం సంక్రాంతి పండుగ రోజు బ్రహ్మానందం అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరిశీలించిన డాక్టర్ తక్షణమే సర్జరీ చేయాలని చెప్పటంతో ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌కు తీసుకెళ్లారు. అక్కడ బ్రహ్మానందంకు సర్జరీ చేశారు.

ఆసుపత్రిలోని ప్రముఖ  కార్డియాక్ సర్జన్ రామకుంట పాండ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వారం రోజుల తర్వాత బ్రహ్మానందాన్ని డిశార్జ్ చేస్తామని డాక్టర్ రామకుంట పాండ తెలిపారు. బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్ద  ఆస్పత్రిలోనే ఉన్నారు.

62 సంవత్సరాల బ్రహ్మానందం తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం. కేవలం బ్రహ్మానందాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని సీన్స్‌ని క్రియేట్ చేసేవారు దర్శక, నిర్మాతలు. హాస్య బ్రహ్మాగా పేరు తెచ్చుకుని దశాబ్దం పాటు బ్రహ్మానందం లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన తెరపై కనిపిస్తే చాలు నవ్వులు వెల్లివిరిసేవి. ఈ మధ్య సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. రీసెంట్‌గా ఎన్టీఆర్ కధానాయకుడులో .. రేలంగి పాత్రలో కనిపించారు. దాదాపు వెయ్యికు పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం సౌతిండియాలో టాప్ కమెడియన్‌గా వెలిగారు.