Kannappa : కన్నప్ప సినిమాలో నటించే కామెడీ స్టార్స్ ఎవరో తెలుసా..?
మంచు విష్ణు కన్నప్ప మూవీ కాస్టింగ్ విషయం రోజురోజుకి సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.

Comedy star in Vishnu Manchu Kannappa movie
Kannappa : మోహన్ బాబు నిర్మాతగా మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన దీనిని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని న్యూజిలాండ్‌లోనే జరపనున్నట్లు విష్ణు గతంలోనే తెలియజేశాడు. ఈక్రమంలోనే షూటింగ్ కోసం కావాల్సిన భారీ టీంని, సెట్ ప్రోపర్టీని తీసుకోని విష్ణు అక్కడికి చేరుకొని శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ కాస్టింగ్ విషయం రోజురోజుకి సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.
ఈ మూవీలో ఇప్పటికే ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, నయనతార, మధుబాల వంటి స్టార్ క్యాస్ట్ ని సెలెక్ట్ చేశారు. అలాగే వీరితో పాటు ఇంకెన్నో సర్ ప్రైజ్ క్యాస్టింగ్, ఆర్టిస్టులు కన్నప్పలో ఉన్నారని మంచు విష్ణు చెబుతున్నాడు. ఇది ఇలా ఉంటే, ఈ సినిమాలో నటించే కామెడీ స్టార్స్ ఎవరో ఇప్పుడు బయటకి వచ్చింది. టాలీవుడ్ నటి సురేఖ వాణి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేస్తూ.. కన్నప్పలో నేను భాగం అయ్యినందుకు హ్యాపీగా ఉందంటూ పేర్కొంది. ఇక ఈ పిక్ లో సురేఖతో పాటు కమెడియన్స్ బ్రహ్మానందం, రఘుబాబు, సప్తగిరి, నిర్మాత మోహన్ బాబు, దర్శకుడు ముఖేష్ కనిపిస్తున్నారు.
Also read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ డిజిటల్ రైట్స్ ఆ రేంజ్‌కి అమ్ముడు పోయాయా..?
View this post on Instagram
కన్నప్ప షూటింగ్ కోసం వీరంతా న్యూజిలాండ్ చేరుకున్నట్లు తెలుస్తుంది. మోహన్ బాబు అక్కడే ఉండి సినిమా పనులన్నీ చూసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇటీవల మూవీ షూటింగ్ మంచు విష్ణుకి గాయం జరిగి చిత్రీకరణను తాత్కాలికంగా ఆపేశారని తెలిసింది. డ్రోన్ సాయంతో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా విష్ణుకి గాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం విష్ణుకి రెస్ట్ ఇచ్చి మిగిలిన పాత్రలు పై వచ్చే సన్నివేశాలను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది.