Game Changer : ‘గేమ్ ఛేంజర్’ డిజిటల్ రైట్స్ ఆ రేంజ్‌కి అమ్ముడు పోయాయా..?
ఒక చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ కాకున్నా.. గేమ్ ఛేంజర్ సినిమాకి ఓ రేంజ్ బిజినెస్ జరిగిందట.

S Shankar Ram Charan Kiara Advani Game Changer digital rights news
Game Changer : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న పొలిటికల్ డ్రామా మూవీ ‘గేమ్ ఛేంజర్’. మరో తమిళ స్టార్ డైరెక్టర్ ‘కార్తీక్ సుబ్బరాజ్’ ఈ సినిమాకి కథని అందిస్తున్నారు. శంకర్ సినిమాలు అంటే.. కమర్షియల్ విత్ సోషల్ మెసేజ్ తో ఉండేవి. కానీ రోబో మూవీ తరువాత శంకర్ టెక్నాలజీ వైపు అడుగులు వేశారు. కానీ ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ని ఒకప్పటి శంకర్ ఫార్ములాతో తెరకెక్కిస్తున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ విజయం తరువాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.
ఈ హైప్ తోనే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఓ రేంజ్ కి అమ్ముడు పోయాయని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ మొత్తం జీ స్టూడియోస్ సొంతం చేసుకుందట. ఇక ఈ రైట్స్ ని దాదాపు 275 కోట్ల పైగా కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు ఒక పోస్టర్ అండ్ టైటిల్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఒక చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ కాకున్నా.. ఈ సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరగడం వావ్ అనిపిస్తుంది. అయితే కొంతమంది.. చరణ్ అండ్ శంకర్ కి ఉన్న మార్కెట్ కి ఈ రేంజ్ రేట్ పలకడం పెద్ద ఆశ్చర్యం కాదని కామెంట్స్ చేస్తున్నారు.
Also read : Thangalaan : ‘తంగలాన్’ సినిమా కోసం మరోసారి ఆ ప్రయోగం చేసిన విక్రమ్.. ఏంటది..?
కాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ని ఈ దీపావళికి తీసుకు వస్తున్నట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. ‘జరగండి’ అంటూ సాగే ఈ పాట ఇప్పటికే లీక్ అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. కానీ అఫీషియల్ గా సాంగ్ రిలీజ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు.