Thangalaan : ‘తంగలాన్’ సినిమా కోసం మరోసారి ఆ ప్రయోగం చేసిన విక్రమ్.. ఏంటది..?
ప్రయోగాలు చేయడానికి ఎప్పుడు ముందు ఉండే తమిళ్ స్టార్ హీరో విక్రమ్.. ‘తంగలాన్’ సినిమా కోసం మరోసారి ఆ ప్రయోగం చేస్తున్నాడట.

Chiyaan Vikram did that experiment again for Thangalaan movie
Thangalaan : తమిళ్ స్టార్ హీరో విక్రమ్ ప్రయోగాలు చేయడానికి ఎప్పుడు ముందే ఉంటాడు. తాజాగా ఈ హీరో ఒక అడివి మనిషిలా బీస్ట్ గా మారిపోయి ‘తంగలాన్’ అనే సినిమా చేస్తున్నాడు. పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కొన్ని వందల ఏళ్ళ క్రితం కథ అని, కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోందని చెబుతున్నారు. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈక్రమంలోనే హైదరాబాద్ లో కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో విక్రమ్ కూడా పాల్గొన్నాడు.
ఈ ఈవెంట్ లో విక్రమ్ మాట్లాడుతూ.. “నా శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ చిత్రాలు మాదిరి ఇది కూడా ఒక డిఫరెంట్ మూవీ. ఈ సినిమాలో నాకు అసలు డైలాగ్స్ ఉండవు. నా గత చిత్రం శివపుత్రుడులో మాట్లాడకుండా ‘ఆ..’ అంటూ గట్టిగా అరిచి సౌండ్ చేసినట్లే.. ఈ మూవీలో కూడా అరుస్తూ యాక్ట్ చేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక శివపుత్రుడు సినిమాతోనే ఆ ప్రయోగం చేసి మెప్పించడంతో.. ఇప్పుడు ఈ మూవీని కూడా ఆడియన్స్ ఆదరిస్తారని విక్రమ్ ధీమా వ్యక్తం చేశాడు.
Also read : Anand Deverakonda : తమిళ స్టార్ ప్రొడ్యూసర్స్‌తో ఆనంద దేవరకొండ ‘డ్యూయెట్’.. అప్పుడు విజయ్‌తో..
స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. 2024 జనవరి 26న ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ మూవీ విషయం పక్కన బెడితే.. ఈ నెలలో విక్రమ్ తన ‘ధ్రువ నక్షత్రం’ ఆడియన్స్ ముంచుకు తీసుకు రాబోతున్నాడు. ఈ సినిమాని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. చాప్టర్-1 ఈ నవంబర్ 24న రిలీజ్ కాబోతుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.