Anand Deverakonda : తమిళ స్టార్ ప్రొడ్యూసర్స్‌తో ఆనంద దేవరకొండ ‘డ్యూయెట్’.. అప్పుడు విజయ్‌తో..
విజయ్ దేవరకొండని తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసిన తమిళ స్టార్ ప్రొడ్యూసర్స్.. ఇప్పుడు ఆనంద దేవరకొండని కూడా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు.

Anand Deverakonda next movie with tamil star producers Studio Green
Anand Deverakonda : విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆనంద్ దేవరకొండ.. అన్న కంటే స్పీడ్ గా ముందుకు దూసుకు పోతున్నాడు. ఇటీవల ‘బేబీ’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ‘గం గం గణేశా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అది కూడా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త సినిమాని లాంచ్ చేసేశాడు. అది కూడా తమిళ స్టార్ ప్రొడ్యూసర్స్ స్టూడియో గ్రీన్ సంస్థతో కావడం విశేషం. తమిళ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలకు ఈ సంస్థ హోమ్ బ్యానర్ లాంటింది.
గతంలో ఈ బ్యానర్ విజయ్ తో కూడా ఒక సినిమా చేసింది. ‘నోటా’ మూవీతో విజయ్ ని తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు ఆనంద్ ని కూడా పరిచయం చేయడానికి సిద్దమవుతుంది. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దగ్గర పనిచేసిన మిథున్ వరదరాజ కృష్ణన్ “డ్యూయెట్”తో దర్శకుడిగా పరిచయమవుతూ ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు. కేఈ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో లావిష్ మేకింగ్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Also read : Jawan : ఓటీటీకి వచ్చేసిన జవాన్.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?
వైవిధ్యమైన ప్రేమ కథతో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. “డ్యూయెట్” అనే లవబుల్ టైటిల్ ని పెట్టిన మేకర్స్.. నేడు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకులు హరీశ్ శంకర్, చందూ మొండేటి, సాయి రాజేశ్,హీరో సత్య దేవ్ ఆనంద్ పేరెంట్స్ గోవర్థన్ దేవరకొండ, మాధవి అతిథులుగా హాజరయ్యారు. ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే వారం నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుందని పేర్కొన్నారు.
A new beginning! ❤️
A new film with a superb team.
Looking forward to the shoot and present this beautiful story. #duet ?@StudioGreen2 @madhurasreedhar @gvprakash @mithukrish12 @RitikaNayak_ @GskMedia_PR pic.twitter.com/oWd5OJDJ4W— Anand Deverakonda (@ananddeverkonda) November 2, 2023