Jawan : ఓటీటీకి వచ్చేసిన జవాన్.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?
నేడు నవంబర్ 2 షారుఖ్ పుట్టినరోజు కావడంతో 'జవాన్' ఓటీటీలో రిలీజ్ చేశారు. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసా..?

Shah Rukh Khan Jawan released in ott on occasion of his birthday
Jawan : షారుఖ్ ఖాన్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా, ప్రియమణి, దీపికా పదుకొనే.. మరికొంతమంది స్టార్స్ ముఖ్య పాత్రలు చేశారు. తమిళ రాక్ స్టార్ అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి ఈ ఏడాది షారుఖ్ లిస్ట్ లో మరో 1000 కోట్ల సినిమాగా చేరింది. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని సంచలనం సృష్టించింది.
ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఉన్న హీరోగా షారుఖ్ రికార్డు సృష్టించాడు. పఠాన్ కంటే ఎక్కువ కలెక్ట్ చేసి షారుఖ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇక షారుఖ్ కి ఇంతటి విజయం అందించిన ఈ మూవీని దాదాపు అందరూ థియేటర్స్ లో చేసేశారు. అయితే ఓటీటీకి వస్తే మళ్ళీ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. నేడు నవంబర్ 2 షారుఖ్ పుట్టినరోజు కావడంతో ‘జవాన్’ ఓటీటీలో రిలీజ్ చేశారు. నెట్‌ఫ్లిక్స్ లో హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది.
Also read : Dunki Teaser : షారుఖ్ ఖాన్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది.. ‘డంకీ’ టీజర్ రిలీజ్..
View this post on Instagram
కాగా ఈ మూవీలో షారుఖ్ రెండు పాత్రల్లో కనిపించి అలరించిన విషయం తెలిసిందే. ఈ రెండిటిలో విక్రమ్ రాథోర్ పాత్ర చాలా ఫేమ్ ని సంపాదించుకుంది. దీంతో ఆ పాత్రతో జవాన్ 2 తీస్తాను అంటూ దర్శకుడు అట్లీ వెల్లడించాడు. మరి ఈ సీక్వెల్ ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాలి. ఇది ఇలా ఉంటే, షారుఖ్ ఈ ఏడాది మరో సినిమాని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. ‘డంకీ’ అనే ఎమోషనల్ మూవీని క్రిస్టమస్ కానుకగా తీసుకు రాబోతున్నాడు. నేడు ఆ మూవీ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.