Dunki Teaser : షారుఖ్ ఖాన్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది.. ‘డంకీ’ టీజర్ రిలీజ్..
షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ ‘డంకీ’ టీజర్ వచ్చేసింది. షారుఖ్ బర్త్ డే గిఫ్ట్ గా నేడు ఆ టీజర్ ని ఫ్యాన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

Dunki Teaser
Dunki Teaser : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి చేస్తున్న సినిమా ‘డంకీ’. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దమైన ఈ మూవీ.. క్రిస్టమస్ కి వచ్చేందుకు డేట్ ని కూడా ఫిక్స్ చేసుకుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు ఒక పోస్టర్ తప్ప మరొక అప్డేట్ ఇవ్వలేదు. నేడు నవంబర్ 2 షారుఖ్ పుట్టినరోజు కావడంతో.. అభిమానులకు డంకీ మేకర్స్ మంచి గిఫ్ట్ ఇచ్చారు. మూవీ నుంచి ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు.
టీజర్ బట్టి అర్థమైంది ఏంటంటే.. ఐదుగురు యంగ్ స్టార్స్ ఇంగ్లాండ్ వెళ్ళాలి అనే ధ్యేయంతో ఉంటారు. ఎలాగైనా ఆ దేశం వెళ్ళాలని అనుకోని ఇల్లీగల్ గా ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది మిగిలిన కథ. 3 ఇడియట్స్, PK, సంజు వంటి సినిమాలు తెరకెక్కించిన హిరానీ నుంచి వస్తున్న సినిమా కావడంతో మూవీలోని స్టోరీ అండ్ ఎమోషన్స్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక త్వరలోనే సెకండ్ టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారట.
Also read : Mega Family : మెగా హీరోలతో కొత్త జంట.. ఫ్రేమ్ అదిరిపోయింది..
కాగా ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఒక రూమర్ వినిపిస్తుంది. అదేంటంటే.. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘కామ్రేడ్ ఇన్ అమెరికా’కి ఫ్రీమేక్ గా వస్తుందని టాక్. ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే ఆ రూమర్ నిజమనే అర్ధమవుతుంది. కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు అర్ధమవుతుంది. దుల్కర్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘కామ్రేడ్ ఇన్ అమెరికా’ సినిమా కథ ఏంటంటే.. తన ప్రియురాలు కోసం హీరో దొంగతనంగా అమెరికాకి బయలుదేరి అనేక సమస్యలు ఎదుర్కొంటాడు.