Chaitanya Master : చైత‌న్య మాస్ట‌ర్ ఆత్మహత్యకి వారే కారణం.. కండెక్ట‌ర్ ఝాన్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఢీ డాన్స్ కొరియోగ్రాఫర్‌ చైత‌న్య ఆత్మహత్య చేసుకోడానికి రీజన్ వాళ్లే అంటూ కండెక్ట‌ర్ ఝాన్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

Chaitanya Master : చైత‌న్య మాస్ట‌ర్ ఆత్మహత్యకి వారే కారణం.. కండెక్ట‌ర్ ఝాన్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Conductor Jhansi viral comments on Chaitanya Master incident

Updated On : May 2, 2023 / 9:13 PM IST

Chaitanya Master : ఢీ డాన్స్ షో కొరియోగ్రాఫర్‌గా చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న చైతన్య మాస్టర్ ఆత్మహత్య అందర్నీ షాక్ కి గురి చేసింది. అప్పులు వల్లే ఆ నిర్ణయం తీసుకున్నట్లు, ఢీ ఫేమ్ ని ఇచ్చింది గాని సంపాదన ఇవ్వలేకపోయిందని, ఢీ కంటే జబర్దస్త్ షోలోనే ఎక్కువ మనీ ఇస్తారంటూ ఒక సెల్ఫీ వీడియో చేసి సూసైడ్ చేసుకున్నాడు. ఈ వీడియో బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యింది. ఇక ఈ విషయం పై చైతన్య సహా డాన్సర్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తన డాన్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న కండెక్ట‌ర్ ఝాన్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

Chaitanya Master : ఢీ చైతన్య మాస్టర్ అప్పుల వల్ల కాదా ఆత్మహత్య చేసుకుంది? రాజు మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..

“చైతన్య మాస్టర్ నిర్ణయం వల్ల వాళ్ళ కుటుంబం చాలా బాధ పడుతుంది. ఆయన తన తోటి క‌ళాకారుల‌కు మనీ ఇవ్వాల్సి ఉన్న మాట నిజమే. అయితే వాళ్లంతా ఆయనతో ముందు నుంచి ట్రావెల్ అయిన వారే. తన పొజిషన్ ఇది అని చెబితే వాళ్ళు అర్ధం చేసుకునేవారు. అలాంటిది ఆయన ఎందుకు ఇంత పని చేసారో అర్ధం కావడంలేదు. అసలు ఆయనకు ఇంతటి పరిస్థితి రావడానికి గల కారణం.. ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్స్‌ మరియు కొంత మంది ఆర్టిస్టులు” అంటూ చెప్పుకొచ్చింది.

Chaitanya : ఢీ డాన్స్ మాస్టర్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో జబర్దస్త్ షో పై..

న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న చైతన్య ఒక ఈవెంట్ ఒప్పుకున్నాడు. ఆ ప్రోగ్రాం కోసం కొందరి ఆర్టిస్ట్ లను కూడా బుక్ చేసుకున్నాడు. అయితే ఈవెంట్ రోజున ఆ ఆర్టిస్టులు రాకుండా హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఆ ప్రోగ్రాం కండక్ట్ చేసిన ఆర్గ‌నైజ‌ర్స్‌కు లాస్ వ‌చ్చింది. దీంతో తీసుకు వస్తానన్న ఆర్టిస్టుల‌ను చైతన్య మాస్టర్ తీసుకురాకపోవడంతో కమిటీ వాళ్ళు మాస్టర్ ఇవ్వాల్సిన అమౌంట్ ఆపేశారు. దాదాపు 7 ల‌క్ష‌ల మొత్త‌మ‌ది. హ్యాండ్ ఇచ్చిన ఆర్టిస్ట్ లు వల్ల మనీ ఆగిపోతే వచ్చిన ఆర్టిస్ట్ లను డబ్బు ఇవ్వకుండా మోసం చేయకూడదని చైతన్య మాస్టర్ బయట అప్పు చేసి, తీసుకు వచ్చి ఈవెంట్ కి హాజరయిన ఆర్టిస్ట్ లకు ఇచ్చాడు. ఇక ఆ అప్పుని పూర్చడానికి అప్పులు మీద అప్పులు చేయాల్సి రావడంతో సూసైడ్ చేసుకున్నట్లు కండెక్ట‌ర్ ఝాన్సీ తెలిపింది.